అన్వేషించండి

Sigachi Blast Incident: లెక్క తేలని సిగాచి పేలుడు మృతుల సంఖ్య! బాధితుల కుటుంబాల్లో ఆందోళన

Sigachi Industries Blast Incident | సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్యపై క్లారిటీ రావడం లేదు. బాధిత కుటుంబాలు తమ వారి కోసం కన్నీళ్లు పెడుతున్నాయి.

సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో గందరగోళం నెలకొంది. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా ఇంకా మృతదేహాల సంఖ్య, గాయపడిన వారి వివరాలు కొలిక్కిరాలేదు. 143 మందే డ్యూటికి వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సిగాచి కెమికల్స్ నుంచి వివరాలు సరిగ్గా లేకపోవడం ఇప్పటి వరకు సరిగా లెక్కలేని మృతులు, క్షతగాత్రుల సంఖ్య. అధికారులు చెబుతున్న లెక్కకు, మార్చురీ వద్ద మృత దేహాల లెక్కలకు మధ్య తేడా ఉంది. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అధికారులు వివరాలు చెప్పలేకపోతున్నారు. 

అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మృతి చెందారు, 34 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఇప్పటి వరకు 45 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తున్నా అధికారులు ధ్రువీకరించడం లేదు. మరోవైపు సిగాచి సంస్థ యాజమాన్య అటువైపు కన్నెత్తి చూడటం లేదు. యాజమాన్యం నుంచి ఏ ఒక్కరు వచ్చి పరిశీలించడకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.  


Sigachi Blast Incident: లెక్క తేలని సిగాచి పేలుడు మృతుల సంఖ్య! బాధితుల కుటుంబాల్లో ఆందోళన

14 మంది పేర్లు అధికారికంగా ప్రకటించిన అధికారులు..

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 14 మంది పేర్లు అధికారులు ప్రకటించారు. మనోజ్ రౌత్. జి నిఖిల్, శ్రీ రమ్య, వి ఆర్ జి నాగేశ్వరరావు, సునీల్ కుమార్, తేనా సుందర్, లంగజిత, రుస్తాన్ కథున్, జగన్మోహన్, జయ ప్రసన్న, హేమ సుందర్, శశి భూషణ్, గోవింద్ సాహూ, రామ్ సింగ్ లు మరణించినట్లు ప్రకటించారు.

సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు
పాశమైలారంలోని సిగాచి కెమికల్స్ కంపెనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 36 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో సిగాచి యాజమాన్యంపై 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పలువురు కాలిన గాయాలతో పటాన్ చెరు లోని ఆస్పత్రి, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో అగ్నిప్రమాదం జరిగిన సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీకి వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అంతపెద్ద ప్రమాదం జరిగితే సిగాచి నుంచి యాజమాన్యంలో ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.1 కోటి, గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటించారు. అయితే తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. తక్షణమే వారికి నగదు అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఆదేశించారు. 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
కేంద్రంతో చర్చలు సఫలం.. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన సీజేపీ
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget