TRS Plenary: రైతులపై కేంద్రం అక్కసు చూపిస్తే, రాష్ట్ర ప్రభుత్వ అక్కున చేర్చుకుంది, వ్యవసాయ తీర్మానంలో టీఆర్ఎస్
ప్లీనరీలో మొత్తం 13 తీర్మానాలు ప్రవేశ పెట్టింది టీఆర్‌ఎస్. తెలంగాణలో వ్యవసాయ వృద్ధిని వివరిస్తూ... కేంద్రం చూపిస్తున్న వివక్షను తెలియజేస్తూ వ్యవసాయ తీర్మానంలో తీవ్ర ఆరోపణలు చేసింది.
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ప్లీనరీలో తొలి తీర్మానంగా ప్రవేశ పెట్టారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ వ్యవసాయ వ్యతిరేక విధానాలు తీసుకుందని తీర్మానంలో ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు.
వ్యవసాయరంగాభివృద్ధికి కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదంది టీఆర్ఎస్. ఎనిమదేళ్లలో చాలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుందని సభకు తెలియజేశారు. దేశంలో ఆశ్చర్యపోయే వ్యవసాయ రంగంలో పురోగతి సాధించామన్నారు. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు.
తీవ్ర సంక్షోభంలో కూరుపోయిన వ్యవసారయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చాలా శ్రమించామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో విద్యుత్ కోతలు, సాగునీటి కొరతను తక్కువ కాలంలోనే అధిగమించినట్టు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ విద్యుత్ సబ్సిడీ కోసం ఎనిమిదేళ్లలో 87, 421 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటైన తొలి నుంచే కోటీ ఇరవై ఐదు లక్షల ఎకరాలకు తాగు నీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టామన్నారు. ప్రపంచంలోని అతి పెద్దదైన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు రూపకల్పన చేసి పూర్తి చేశామన్నారు. మరిన్ని ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నట్టు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎనిమిదేళ్లలో లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించి... తెలంగామలో గణనీయంగా భూగర్భ జలాలు పెంచినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ రెండు దఫాలుగా 22, 224 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. రైతులకు పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం ఎకరానికి పదివేల చొప్పున ఆర్థిక సాయం రైతు బంధు ద్వారా అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ పథకం యావత్ దేశానికి దిక్సూచిలా మారిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు రైతులకు 65,391 కోట్లు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రత కోసం రైతు బీమా కోసం 5, 755 కోట్లు వెచ్చించామన్నార.ు
ప్రతి ఐదు వేల ఎకరాలను ఓ వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి ప్రతీ క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించినట్టు తెలిపారు. వీళ్లంతా ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు సలహా ఇస్తున్నారన్నారు. వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రత్సహించేందుకు ఫాం మెకమైజేషన్ కోసం ఎనిదేళ్లలో 775కోట్ల 93 లక్షలు ఖర్చు చేసిందన్నారు.
ఇలా వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి అభినందించాల్సిన కేంద్రం విపక్ష చూపిందన్నారు. అన్ని విధాలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతూ వచ్చిన కేంద్ర యాసంగిలో ధాన్యం సేకరించే విషయంలో కూడా మోసం చేసిందన్నారు. బియ్యం కొనుగోలు విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించకపోవంతో విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలుకు ముందుకు వచ్చిందన్నారు. యాసంగి పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్లీనరీ ప్రశంసించింది.