Hyderabad Rain: హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం- కాలనీల్లో నీళ్లు- రోడ్లపై వాహనాలు జామ్
Hyderabad Rain: రెండు గంటలపాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ షేక్ అయిపోయింది. రికార్డు స్థాయిలో వానకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Hyderabad Rain: హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన వానకు సిటీ ఒక్కసారిగా అతలాకుతలమైంది. కాలనీలు అన్నీ జలమయమైపోయాయి. రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. హైదరాబాద్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి.
హైదరాబాద్‌లో వాతావరణం చాలా భిన్నంగా మారుతోంది. ఓ వైపు ఉక్కపోత, మరోవైపు కుండపోత. ఇలా భిన్నంగా ఉన్న టైంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. సోమవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి సిటీ ఒక్కసారిగా కకావికలమైపోయింది. జనం ఇబ్బందులు పడ్డారు. వాహనాలు గంటల తరబడి రోడ్లపై నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి.
Aditya Traders Centre, #Ameerpet ⛈️ — Scary visuals emerging as heavy rains lash the area. Stay safe, #Hyderabad!#Hyderabadrains pic.twitter.com/2s0kxg0d6Q
— Hyderabad Rains (@Hyderabadrains) August 4, 2025
అమీర్‌పేట నుంచి కూకట్‌పల్లి వరకు, సికింద్రాబాద్ నుంచి లక్డీకాపూల్, లక్డీకాపూర్ నుంచి మెహిదీపట్నం వరకు, పంజాగుట్ట నుంచి దుర్గంచెరువు వరకు ప్రతి చోట ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వర్షం ప్రారంభానికి ముందే ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. అయినా కార్యాలయాలు వదిలేటప్పుడు వర్షం పడటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
Ameerpet~Panjagutta stretch completely flooded 🌊⚠️ Heavy waterlogging everywhere — Stay safe, #Hyderabad#Hyderabadrains pic.twitter.com/VprKfSZSmR
— Hyderabad Rains (@Hyderabadrains) August 4, 2025
రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఎక్కడికక్కడ అధికారులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. నీరు నిలిచిన ప్రాంతంలో చర్యలు చేపట్టారు. ప్రజల అవస్తలు తీర్చేందుకు శ్రమించారు.
#HYDTPinfo #RainAlert
Due to heavy #Rain and #waterlogging at Shaikpet nala flyover, traffic movement is slow.
Commuters, please take alternate routes to avoid congestion.
Tolichowki Traffic Police ensures smooth traffic flow. #HyderabadRains #Monsoon2025 pic.twitter.com/yip9o3IBoC
— Hyderabad Traffic Police (@HYDTP) August 4, 2025 />హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం ఇలా ఉంది
మహదేవపురం- 151.5MM
బంజారాహిల్స్- 124.5MM
యూసఫ్‌గూడ- 117MM
శ్రీనగర్ కాలనీ- 106.3 MM
రాజీవ్ గృహకల్ప- 102 MM
కూకట్‌పల్లి విలేజ్- 100MM
CESS(ఖైరతాబాద్)- 99.3 MM
మైత్రీవనం - 92.8MM
గణాంక భవన్- 89.5MM
మిగతా ప్రాంతాల్లో 90MM కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఆ వివరాలు ఈ ఫొటోలలో చూడొచ్చు.

























