అన్వేషించండి

Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సందర్భంగా నాలుగు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆ వివరాలివే

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కారణంగా నాలుగు రోజులపాటు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. నేటి నుంచి నవంబర్ 2 వరకు వాహనాలను దారి మళ్లీస్తున్నారు.

కాంగ్రెస్​అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలోకి ప్రవేశిస్తుంది. దాంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా నాలుగు రోజుల పాటు వెహికల్స్ దారి మళ్లిస్తున్నారు. షాద్​నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 వరకు వరకు వెహికల్స్ డైవర్షన్ ఉంటుంది. 
జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వెహికల్స్​ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో లేన్​లో వచ్చే వెహికల్స్ అమిత్ కాటన్ మిల్, బూర్గుల క్రాస్​రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్ నగర్​వైపు వెళ్లాలని సూచించారు. బెంగళూరు నుంచి షాద్​నగర్​ వైపు వచ్చే వెహికల్స్ కేశంపేట క్రాస్​రోడ్, చటాన్​పల్లి రైల్వే గేట్​ మీదుగా వెళ్లాలి. ఇక పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వెహికల్స్ షాద్​నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు చేరుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 31న ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..
- పరిగి నుంచి సిటీ వైపు వచ్చే వెహికల్స్ షాద్​నగర్ క్రాస్​రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేట్​మీదుగా వెళ్లాలి.
- హైదరాబాద్ నుంచి షాద్​నగర్​కు వెళ్లే వెహికల్స్ కొత్తూరు​ వై జంక్షన్​, జేపీ దర్గా క్రాస్ రోడ్,  నందిగామ, దస్కల్​ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
- జడ్చర్ల నుంచి షాద్​నగర్​ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికల్స్​ వన్​వేలో వెళ్లాల్సి   ఉంటుంది.

శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 31న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు...
బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వెహికల్స్ పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్​గూడ, గొల్లపల్లి, కిషన్​గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 1న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ..
బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్​గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్​ రోడ్, జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్​పాస్, గగన్​పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

నవంబర్ 2న బాలానగర్ ట్రాఫిక్‌‌‌‌ పీఎస్ పరిధిలో..
- బోయిన్​పల్లి నుంచి బాలానగర్​ వైపు వెళ్లే వెహికల్స్ బోయిన్​పల్లి జంక్షన్, ఓల్డ్ ఎయిర్ పోర్ట్, గౌతం నగర్, శోభన జంక్షన్, ఫతేనగర్ పైప్​లైన్ రోడ్ మీదుగా బాలానగర్ చేరుకోవాల్సి ఉంటుంది. 
- బాలానగర్ నుంచి బోయిన్ పల్లి వైపు వెళ్లే వెహికల్స్ సైతం ఇదే రూట్ లో వెళ్లాలి.
- బోయిన్​పల్లి నుంచి కూకట్​పల్లి వైపు వెళ్లే వెహికల్స్ బాలానగర్ టీ–జంక్షన్ నుంచి ఫతేనగర్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా కూకట్ పల్లి వై జంక్షన్ కు చేరుకోవాల్సి ఉంటుంది.
- బోయిన్​పల్లి, జీడిమెట్ల నుంచి కూకట్​పల్లి వైపు వచ్చే వాహనాలు నర్సాపూర్ జంక్షన్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
- కూకట్​పల్లి నుంచి బోయిన్​పల్లి వైపు వెళ్లే వెహికల్స్ నర్సాపూర్ జంక్షన్, గుడెన్ మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, సుచిత్రా సర్కిల్ మీదుగా వెళ్లాలి. 

కూకట్​పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ ట్రాఫిక్ పీఎస్​ల పరిధిలో..
- బాలానగర్ ​నుంచి అంబేద్కర్ వై జంక్షన్ వైపు వచ్చే వెహికల్స్  ఒకే లేన్​లో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు.
-  మూసాపేట నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్​ను వై జంక్షన్ నుంచి ఇక్రిశాట్ వరకు రెండు లేన్లలో అనుమతిస్తారు. 
- కూకట్ పల్లి నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్​ను రెండు లేన్లలో అనుమతిస్తారు.
- జేఎన్టీయూ నుంచి ఇక్రిశాట్ వైపు వెహికల్స్ ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో 3 లేన్లలో పాదయాత్ర ఉంటుంది.  
- వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Embed widget