అన్వేషించండి

Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్

సికింద్రాబాద్ చిలకలగూడలో యువకుడు యావన్ హత్య కేసును ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా తేల్చిన పోలీసులు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు.5 రోజుల ముందే స్కెచ్ వేసి ఈ హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

హైదరాబాద్: మే 7న సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో సంచలనం సృష్టించిన యువకుడు యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన 'ప్రీ ప్లాన్డ్ మర్డర్' అని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. యువతిని పెళ్లి చేసుకోవాలని భావించిన బావ.. ఆమె ప్రేమ వ్యవహారం నచ్చక బీటెక్ విద్యార్థి హత్యకు ప్లాన్ చేశాడు. మరదలు తనకు దక్కదన్న భయంతో ఆమె ప్రియుడు యావన్‌ను ప్లాన్ చేసి యువతి కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 5 ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసి మొత్తం 10 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. 

మరదలు తనకు దక్కదనే కోపంతో యువకుడి హత్య..

సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. యావన్, అమ్మాయి స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలో గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు గతంలోనే యావన్‌ను హెచ్చరించారు. అయినప్పటికీ యావన్ తమ అమ్మాయి వెంట తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమ్మాయి బావ అల్లబోయిన సాయికిరణ్ ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. కుటుంబసభ్యులు సైతం అందుకు సిద్ధంగానే ఉన్నారు.  వారు వినకపోవడంతో, యువతి బావ అల్లబోయిన సాయి కిరణ్ (A1) హత్యకు ప్లాన్ వేశారు. సాయి కిరణ్ చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో అతడిపై గతంలో కేసులు ఉన్నాయి. యువతిని తాను పెళ్లి చేసుకోవాలని భావించిన సాయి కిరణ్, ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు.


Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్

అరెస్టైన నిందితుల వివరాలు
-  ఏ1 సాయి కిరణ్‌ (అమ్మాయి బావ)
-  ఏ2 రాజాం పరమేశ్‌(అమ్మాయి అన్న)
-  ఏ3 రాజాం వంశీకృష్ణ
-  ఏ4 రాజాం మనీశ్‌
-  ఏ5 శ్రీగిరి రాహుల్‌
-  ఏ6 కుచ్చుల శివనందన్‌
-  ఏ7 రాజాం నరసింహ (అమ్మాయి తండ్రి)
-  ఏ8 రాజాం శ్రీశైలం (అమ్మాయి బాబాయ్‌)
-  ఏ9 రాజాం మల్లేశ్‌ (అమ్మాయి బాబాయి)
-  ఏ10 మైనర్‌ బాలుడు 

5 రోజుల ముందే హత్యకు ప్లాన్..
యావన్ హత్యకు ఐదు రోజుల ముందే నిందితులందరూ కలిసి రెక్కి నిర్వహించారు. మే 7 అర్ధరాత్రి యావన్‌ను ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేశారు. 16, 17 సార్లు కత్తితో పొడవగా తీవ్ర రక్తస్రావంతో అతడు చనిపోయాడు. యావన్ ఓ స్నేహితుడి ఇంటి వద్ద ఉన్నాడని తెలుసుకుని ఈ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఒక్కసారిగా యావన్‌పై కత్తితో దాడి చేయగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ కేసులో యువతి బావ, తండ్రి, బాబాయ్‌లు, సోదరుడు, కజిన్ బ్రదర్స్ సహా మొత్తం 9 మంది నిందితులతో పాటు ఒక మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుల వద్ద నుండి ఒక కత్తి, మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరికి గాంజా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని డీసీపీ వెల్లడించారు. డ్రగ్స్ టెస్టులో ఏ5 శ్రీగిరి రాహుల్‌, ఏ6కుచ్చుల శివనందన్‌కు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుల్లో సగం మంది 21, 22 ఏళ్లలోపే వారే ఉన్నారు. చిన్న వయసులోనే యువకులు హత్య కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని.. దురలవాట్ల కారణంగానే ఇలా ప్రవర్తిస్తున్నారని డీసీసీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget