IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Pawan On Netaji: వంద నోట్‌పై నేతాజి బొమ్మ ముద్రించాలి, అస్థికల్ని భారత్‌కు రప్పించాలి: పవన్ కల్యాణ్

నేతాజి అస్థికల భారత్‌కు తీసుకొచ్చేలా ప్రభుత్వాలు, నేతలపై ఒత్తిడి తీసుకొద్దామని పవన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచే ఉద్యమం మొదలు పెట్టాలన్నారు.

FOLLOW US: 

దేశానికి స్వాతంత్య్రం రావడానికి ప్రాణాలు అర్పించిన వారి పట్ల మనం చాలా ఉదాసింగా వ్యవహరించడం చాలా బాధ కలిగిస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. పవన్‌తోపాటు డాక్టర్ పద్మజారెడ్డి, ఎంవీఆర్ శాస్త్రి కూడా పాల్గొన్ననారు. 

ఎంవీఆర్‌ శాస్త్రి రచించిన నేతాజీ గ్రంథ సమీక్షలో మాట్లాడిన పవన్ కల్యాణ్‌... స్వాతంత్ర్య ఉద్యమం కోసం జైహింద్‌ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అలాంటి వ్యక్తిని మన దేశం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ని గౌరవించుకోలేకపోతే మనం భారతీయులం అని చెప్పుకోవడానికి అర్హత లేదన్నారు. అలాంటి చాలా మంది వ్యక్తుల బలిదానాల వల్లే నేడు మనమంతా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నామన్నారు. అలాంటి వ్యక్తి కోసం నేటి తరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలను నవ్వుతూ ఇచ్చేని సుభాష్ చంద్రబోస్‌ అస్థికలను నేటికీ మన దేశానికి తెచ్చుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. 

టోక్యోలోని రెంకోజీ అనే చిన్న ఆలయంలో ఇప్పటికీ ఆయన అస్థికలు ఉన్నాయని అక్కడి నుంచి తీసుకురావడానికి రెండు మూడు కమిటీలు పనిచేసినా సత్ఫలితాలు ఇవ్వలేదన్నారు పవన్. ఇది నాయకులు అనుకుంటే మాత్రమే అయ్యే పని కాదని... దేశ ప్రజలు ముఖ్యంగా నేటి తరం యువత అనుకుంటే అయ్యే కార్యమని అభిప్రాయపడ్డారు. 

అసలు అవి నేతాజీ అస్థికలో కాదో తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తే సరిపోతుందన్ననారు పవన్. నేతాజి అస్థికలు తిరిగి భారత్‌దేశానికి రావాలని బలంగా కోరుకున్న వ్యక్తుల్లో తాను ఒకడినని పేర్కొన్నారు. రెంకోజీ ఆలయంలో ఉన్న  అస్థికలు రెడ్‌పోర్ట్‌కు రావాలి అక్కడ జాతీయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. 

కనీసం వందరూపాయల నోట్‌పై నేతాజి బొమ్వ ముుద్రించాలని.. అస్థికలను భారత్‌కు రప్పించేలా ఉద్యమానికి హైదరాబాద్‌ నుంచి సిద్ధమవ్వాలన్నారు పవన్ కల్యాణ. మనం నేతాజీలా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని చేతిలో సెల్‌ఫోన్‌తో ప్రభుత్వాలపై, నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మొదలవ్వబోయ్యే ఉద్యమం వైపు ఏదో ఒకరోజు దేశం మొత్తం చూసేలా గుర్తించేలా ప్రయత్నిద్దామన్నారు. అందుకోసం #bringbacknetajiashes #renkonjitoredfort పేరుతో రెండు హ్యాష్‌ ట్యాగ్‌ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. 

ఇలాంటి స్వాతంత్ర్యసమరయోధుల జీవిత చరిత్రలు చదువుతూ పెరిగానని.. ఇంత చేస్తున్నా ఇంకా ఏదో వెలితి తన జీవితంలో ఉన్నట్టు చెప్పారు పవన్. అలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు చదివేలా మన ముందుకు తీసుకొస్తున్న ఎంవీఆర్‌ శాస్త్రీని అభినందించారు పవన్. తనకు కూడా పుస్తకాల పట్ల చాలా ఆసక్తి ఉందన్నారు. అందుకే పుస్తకాలు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటానన్నారు. ఎవరైనా నా పుస్తకాలు తీసుకెళ్లిపోతే మాత్రం చాలా బాధగా ఉంటుందన్నారు. ఈ విషయంలోనే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు తనకు తరచూ ఈవిషయంలోనే వాదన జరుగుతుందన్నారు. ఆయనకు సినిమా ఫ్రీగా చేయమంటే చేస్తాను కానీ పుస్తకాలు ఇమ్మంటే మాత్రం ఇవ్వలేనన్నారు. ఆయన వచ్చే సరికి కొన్ని పుస్తకాలు దాచేస్తానన్నారు. సంపద చూస్తే కొందరికి ఎలాంటి ఆనందం కలుగుతుందో పుస్తకాలను చూస్తే అలాంటి ఆనందం తనకు కలుగుతుందన్నారు పవన్. 

Published at : 25 Mar 2022 12:05 AM (IST) Tags: pawan kalyan Netaji Subhash Chandra Bose Bring Back Netaji Ashes Renkonji To Redfort

సంబంధిత కథనాలు

Karimnagar News :  కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్‌ఎస్ కౌంటర్

TRS Leaders On Modi: తెలంగాణ నేలపై కమలం వికసించే ఛాన్స్ లేదు- మోదీ కామెంట్స్‌కు టీఆర్‌ఎస్ కౌంటర్

KTR In Davos: తెలంగాణలో హ్యుండాయ్ భారీ పెట్టుబడి- దేశాభివృద్ధికి త్రి ఐ చాలా అవసరమన్న కేటీఆర్

KTR In Davos: తెలంగాణలో హ్యుండాయ్ భారీ పెట్టుబడి- దేశాభివృద్ధికి త్రి ఐ చాలా అవసరమన్న కేటీఆర్

Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు

Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు

PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్‌ రెడీ- ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ

PM Modi In ISB: 25 ఏళ్లకు వృద్ధి మ్యాప్‌ రెడీ- ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు