KTR: హైదరాబాద్‌లో లక్షన్నర ఐటీ ఉద్యోగాలు, ప్రపంచంలోనే టాప్ - కేటీఆర్
IT Annual Report 2021 - 22: హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021 - 22 ఏడాదికి గానూ ఐటీ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 8 ఏళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. చివరికి కరోనా పరిస్థితుల నడుమ కూడా అద్భుతమైన ఐటీ ఎగుమతులు చేసి, మెరుగైన వృద్ధి సాధించామని అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021 - 22 ఏడాదికి గానూ ఐటీ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు.
ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య కూడా బాగా పెరిగిందని కేటీఆర్ అన్నారు. గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా 4.5 లక్షల ఐటీ ఉద్యోగాలు లభిస్తే ఒక్క హైదరాబాద్ లోనే లక్షన్నర వరకూ వచ్చాయని గుర్తు చేశారు. 2021 - 22 ఏడాదిలో ఐటీ ఎగుమతుల విలువ రూ.1.83 లక్షల కోట్లుగా ఉంటుందని, 2035 నాటికి ఈ సంఖ్యను రూ.2.9 లక్షల కోట్లకు పెంచామని అన్నారు. ఐటీ, అనుబంధ రంగాల్లో పరిశ్రమల ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం పెరుగుదల సాధించామని చెప్పారు. జాతీయ సగటు కంటే 9 శాతం అదనంగా పెరుగుదల సాధించినట్లుగా కేటీఆర్ వివరించారు.
ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, ఈ నెల 20న టీ హబ్ రెండో దశ ప్రారంభిస్తామని చెప్పారు. టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ఆగస్టులోనే ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్ వివరించారు.
ఇదీ మన తెలంగాణ !!
— Chittem Rammohan Reddy (@ChittemRRTRS) June 1, 2022
డబుల్ ఇంజిన్ పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనవుతుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్యని రెట్టింపు చేసింది.@KTRTRS #TriumphantTelangana #ITisTelangana pic.twitter.com/AXp8P6F6ro
I feel that Telangana Govt means business and understands business. We get immense support from Govt, that is reflected in the growth that we're seeing in the large organisations who are setting up their in Hyderabad - @Manisha_saboo, Infosys head. @KTRTRS #TriumphantTelangana pic.twitter.com/EWyUuhsTF8
— AR (@AshokReddyNLG) June 1, 2022