అన్వేషించండి

మల్లారెడ్డి ప్రాపర్టీస్‌లో నాన్‌స్టాప్‌గా ఐటీ తనిఖీలు- రెండు రోజుల ముందే అధికారుల రెక్కీ

రెండు రోజులు ముందుగానే మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ అధికారులు ప్లాన్లు వేశారని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా ఆయన వద్దకే వెళ్లి వివరాలు ఆరా తీసినట్టు సమాచారం.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, బంధువుల ఇళ్లల్లో ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన తనిఖీలు 24 గంటల పాటు సాగుతున్నాయి. అయితే ఈ ఉదయం నుంచి ఈ తనిఖీల్లో హైడ్రామా నెలకొంది. 

చాతీ నొప్పి ఉందని మల్లారెడ్డి కుమారుడు ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన మల్లారెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరారు. ఆయన్ని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదం చేస్తూనే ఆసుపత్రికి బయల్దేరారు. 

దీంతో సీన్‌ నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరింది. ఐటీ అధికారులు ఆసుపత్రికి చేరుకొని మల్లారెడ్డి కుమారుడు
 మహేందర్‌ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. వైద్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. 

నిన్న ఉదయం ఐదు గంటల నుంచి మల్లారెడ్డి చెందిన ప్రాపర్టీస్‌పై నాన్‌స్టాప్‌గా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఒకేసారి వందల మంది ఐటీ అధికారులు ఆయనతోపాటు ఆయన సంబంధీకుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.

రెండు రోజులు ముందుగానే మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ అధికారులు ప్లాన్లు వేశారని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా ఆయన వద్దకే వెళ్లి వివరాలు ఆరా తీసినట్టు సమాచారం. మల్లారెడ్డికి బాగా తెలిసిన వ్యక్తి ద్వారానే మొత్తం కథను నడిపించారని ఐటీ అధికారుల నుంచి వస్తున్న సమాచారం.

రియల్ ఎస్టేట్‌ వ్యాపారుల్లా ఐటీ అధికారులు... మల్లారెడ్డి ఇంటికి వెళ్లి ప్రాథమిక అంశాలపై ఆరా తీశారు. ఓ డీల్‌ విషయం మాట్లాడినట్టు తెలుస్తోంది. అన్నింటినీ సరి చూసుకున్న తర్వాత రెండు రోజుల్లోనే దాడులు నిర్వహించారు. నిన్న ఉదయం ఒక్కసారి వందల మంది అధికారులు ఆయా నివాసాలు, ఆఫీసులపై మూకుమ్మడి దాడులు చేశారు. వందల బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నారు.

తెల్లవారుతుండగానే మొదలైన సోదాలు

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) నివాసంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుమారుడు, అల్లుడి ఇళ్లల్లో కూడా తనిఖీలు సాగుతున్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి.

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి.

కొత్త విషయాలు

మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్‌ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. జైకిషన్‌, మాధవరెడ్డి, చికోటి ప్రవీణ్‌లు కలిసి క్యాసినోలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతంలో కూడా జైకిషన్‌ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జైకిషన్‌ తండ్రి నరసింహ, మంత్రి మల్లారెడ్డి వ్యాపార భాస్వాములు అని గుర్తించారు. సీఎంఆర్‌ స్కూల్స్‌లో నరసింహ యాదవ్‌, మల్లారెడ్డి పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. దీంతో నరసింహ యాదవ్‌, జైకిషన్‌ ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. కాలేజీల ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Embed widget