అన్వేషించండి
Advertisement
Hyderabad IT Raids: హైదరాబాద్, విశాఖలో ఐటీ సోదాల కలకలం, ప్రముఖ కంపెనీపై ఏకంగా 40 చోట్ల
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం మరోసారి రేగింది. వస్త్రవ్యాపారులకు చెందిన ఇల్లు సహా దుకాణాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏకంగా 40 చోట్ల ఒకే సమయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, అమీర్ పేట, ఏఎస్ రావు నగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వస్త్ర వ్యాపారి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, విశాఖపట్నంలో కూడా వస్త్రవ్యాపారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను చెల్లించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం షాపింగ్ మాల్ యజమానుల ఇళ్లు, షోరూంలు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion