అన్వేషించండి

Hyderabad News: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ కట్టడాల కూల్చివేత - ఆక్రమణలపై HYDRA కొరడా

HYDRA: జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తుంది. చెరువుల ఆక్రమణలను గుర్తించి, అక్రమ కట్టణాలను కూల్చి వేస్తుంది. చెరువులు పునరుద్ధరణే లక్ష్యమని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

HYDRA Action On Illegal Constructions:  జీహెచ్‌ఎంసీ పరిధిలోని లేక్‌ బఫర్‌ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇది నగరంలోని బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించింది. నగరంలో ఆక్రమణలపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దశలవారీగా హైడ్రా పని చేస్తుంది. మొదటి దశలో ఆక్రమణలను అరికట్టడం.. రెండో దశలో అక్రమ నిర్మాణాలు, అనుమతుల నిరాకరణపై చర్యలు తీసుకుంటారు. మూడో దశలో చెరువుల్లో పూడిక తీసి వర్షపు నీటిని మళ్లించనున్నారు. గ్రేటర్‌ పరిధిలో వరుస దాడులతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను పెద్దమొత్తంలో తొలగిస్తున్నారు.

బాచుపల్లిలో కూల్చివేతలు
 బాచుపల్లి ఎర్రకుంట ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. హైడ్రా  కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు నేలమట్టం అవుతున్నాయి. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో నగర శివారులో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు.

గత వారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవేందర్‌నగర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. 329, 342 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూముల్లో సుమారు 51 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూమి, చెరువు ఆక్రమణలో నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని  హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.

చాలా చెరువులు మాయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 400లకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయని ఏవి రంగనాథ్ తెలిపారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి నివేదిక ప్రకారం గత 44 ఏళ్లలో నగరంలో అనేక చెరువులు కనుమరుగయ్యాయి. అనేక చెరువులు ఆక్రమణలకు గురై నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగిస్తారు. బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలను తొలగించకుంటే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో ప్రభుత్వం హైడ్రామాకు పెద్దఎత్తున సిబ్బందిని నియమించనుందని తెలిపారు. హైడ్రాలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. హైడ్రా పరిధి 2,500 చదరపు కిలోమీటర్లు అని ఆయన చెప్పారు.

అవకాశవాదంతో గొలుసుకట్టు చెరువులన్నీ ఆక్రమణలకు గురయ్యాయన్నారు. చెరువులకు నీటిని మళ్లించే కాల్వలు కూడా పూడుకుపోయాయి. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. రాజకీయ ఆరోపణలపై స్పందించబోనని ఏవీ రంగనాథ్ అన్నారు.  బఫర్ జోన్, ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణం చేపట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి తీసుకొస్తామని ఆయన అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget