అన్వేషించండి

హైదరాబాద్ లో కుండపోత - రాత్రి నుంచి దంచి కొడుతున్న వాన - స్కూల్స్‌కు సెలవులు

హైదరాబాద్ సిటీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా వాన పడుతోంది.

ఇన్ని రోజులు ఉక్క ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ వాసులను ఇప్పుడు వానలు తడిసి ముద్ద అయ్యేలా చేస్తున్నాయి. ఆదివారం రాత్రి మొదలైన వర్షాలు ఇంకా వదలడం లేదు. ముసురులా పట్టుకుంది. వేకువజాము నుంచే మరింత ఉధృతంగా కురుస్తుంది.

రెండు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షానికి హైదరాాబాద్‌లోని చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. అధికారులు అప్రమత్తమై నీటి నిల్వలేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. 

సమస్య ఉంటే వెంటనే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040-21111111కు లేదా 100కు, 9000113667కు ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. వర్షాలు కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని స్కూల్స్‌కు సెలవులు ప్రకటిస్తున్నట్టు విద్యా శాఖ ప్రకటించింది.

అలాంటి ఇలాంటి వాన కాదు. కుండలతో పోసినట్టు కురుస్తోంది. అక్కడా ఇక్కడా కాదు హైదరాబాద్‌ మొత్తంగా కురుస్తోంది. జనం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. అర్థరాత్రి నుంచి పడుతున్న వాన జనజీవనాన్ని స్తంభింప జేసింది. 

ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే వారు అష్టకష్టాలు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆటోలు, క్యాబ్‌లు బుక్‌ కావడం లేదు. బుక్ అయినా ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో కూడా భారీగా వసూలు చేస్తున్నారు. రెగ్యులర్‌గా వసూలు చేసే ఛార్జీల నాలుగైదు రెట్లు డిమాండ్ చేస్తున్నారు. మెట్రో అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులు వ్యయప్రయాసలు కోర్చి ఆఫీసులకు చేరుకుంటున్నారు. మిగతా వారి పరిస్థితి వర్ణించడానికి మాటలు చాలవు అన్నట్టు ఉంది. 

సొంత వాహనాలు ఉన్న వారిది మరో కష్టం. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.ఎక్కడికక్కడ నిలిచిపోయిన నీటిలో ప్రయాణం ప్రమాదం అని తెలిసినా తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నారు. కొందరు తడుస్తూనే ఆఫీసులకు చేరుకుంటున్నారు. ఎక్కడ ఏ రోడ్డు తెగి ఉంటుందో, ఏ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో అన్న భయంతోనే వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. 

పరిస్థితి గమనించిన వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తోంది. ఈ రోజంతా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెబుతోంది. భారీగా పడుతున్న వర్షంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. జీడిమెట్ల, మారేడుపల్లి, ఎల్బీనగర్, సాగర్ రింగ్‌రోడ్డు, హస్తినాపురం, నిజాంపేట, అల్విన్ కాలనీ, చిలకలగూడ, సికింద్రాబాద్, సోమాజీగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, ప్రగతీనగర్, కూకట్‌పల్లి, అడ్డగుట్ట, కంటోన్మెంట్‌, బోయినపల్లి, కర్ఖానా, మెహదీపట్నం, టోలీచౌకి, షేక్‌పేట, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కొండాపూర్, మెట్టుగూడ, తార్నాక, ఉప్పల్, కోఠఈ, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్‌ ఇలా అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. 

హైదరాబాద్‌లోని వివిధప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఇలా ఉంది. 
శేరిలింగంపల్లి - 14 సెం.మీ  

మియాపూర్‌లో 14 సెం.మీ 

కూకట్ పల్లి, హైదర్‌నగర్ - 12.7 సెం.మీ 
రాజేంద్రనగర్ - 12 సెం.మీ 

షేక్‌పేట -11.9 సెం.మీ
బోరబండ -11.6 సెం.మీ 

మాదాపూర్‌ -10.7 సెం.మీ
రాయదుర్గం -10.1 సెం.మీ 
ఖైరతాబాద్‌ -10.1 సెంమీ

గాజులరామారం- 10సెం.మీ 

రాజేంద్రనగర్‌- 10 సెం.మీ 
గచ్చిబౌలి- 9.6, సెం.మీ 
బహదూర్‌పురా -8.2 సెం.మీ 
చిలకలగూడ, ఆసిఫినగర్‌ -8.1 సెం.మీ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget