అన్వేషించండి

Husky Dogs: ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?

dogs abandoned: అత్యంత ఖరీదైన సైబీరియన్ హస్కీ జాతికి చెందిన 40 కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు ఒక ట్రక్కులో తీసుకువచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. వాటిని స్వచ్చంద సంస్థ సభ్యులు కాపాడారు.

Expensive husky dogs abandoned: నగర శివార్లలోని శంకర్ పల్లి-పటాన్‌చెరు రహదారిపై అత్యంత దారుణమైన జంతు హింస వెలుగుచూసింది. మంచు ప్రదేశాల్లో పెరిగే అత్యంత ఖరీదైన  సైబీరియన్ హస్కీ  జాతికి చెందిన సుమారు 40 కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు ఒక ట్రక్కులో తీసుకువచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. తీవ్రమైన ఎండలు, ఆహారం, నీరు లేక ఆ మూగజీవాలు అల్లాడిపోయాయి.  ఈ విషయం తెలిసిన స్వచ్చంద సంస్థల  సభ్యులు తక్షణమే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకునే సమయానికే పరిస్థితి హృదయ విదారకంగా మారింది. అప్పటికే ఒక కుక్క ప్రాణాలు కోల్పోగా, మరికొన్ని కుక్కలు ఎండ వేడిని తట్టుకోలేక సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాయి. కొంతమంది దారి వెంట వెళ్లేవారు మరికొన్ని కుక్కలను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.

నిజానికి హస్కీలు చల్లని వాతావరణంలో మాత్రమే జీవించగలవు. వాటిని పెంచుకునేవారు ఏసీ రూముల్లో ఉంచి చూసుకుంటారు. అయితే వీటిని ఇలా రోడ్డుపై వదిలేయడంతో  మండుతున్న ఎండలు వాటి ప్రాణాలకు ముప్పుగా మారాయి. రెస్క్యూ టీమ్ పట్టుకోగలిగిన ఆరు కుక్కలను సురక్షితంగా రక్షించి, తమ షెల్టర్ హోమ్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అడవిలోకి వెళ్లిన మిగిలిన కుక్కల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అసలు ఇన్ని కుక్కలను ఒకేసారి ఎవరు, ఎందుకు వదిలేశారనే కోణంలో విచారణ జరుగుతోంది.
 
నిజానికి సైబీరియన్ హస్కీలు అంటే మార్కెట్‌లో వేల రూపాయల ఖరీదు చేసే జాతి. ఇంత భారీ సంఖ్యలో, సుమారు 40 కుక్కలను రోడ్డుపై వదిలేశారంటే దీని వెనుక ఏదైనా  ఇల్లీగల్ బ్రీడింగ్ సెంటర్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. లాభాల కోసం కుక్కలను మిషన్లలా వాడేసి, అవి వయసు పైబడటమో లేదా అనారోగ్యానికి గురికావడమో జరిగితే, వాటి పోషణ భారం అనిపించి ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డు పాలు చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.   ఏదైనా బ్రీడింగ్ యూనిట్ ప్రభుత్వం పట్టుకుంటుందనే భయంతో రాత్రికి రాత్రే ఇలా ట్రక్కులో తెచ్చి పారేసి ఉంటారని జంతు ప్రేమికులు అనుమానిస్తున్నారు.

 ఈ కుక్కల మెయింటెనెన్స్ చాలా ఖరీదైన వ్యవహారం. వీటికి ఏసీ వాతావరణం, ఖరీదైన ఆహారం అవసరం. ప్రస్తుత వేసవిలో ఏసీ ఖర్చులు, పెరుగుతున్న నిర్వహణ భారమై భరించలేక యజమానులు చేతులెత్తేసి ఉండవచ్చు. అయితే, విక్రయించడానికి ప్రయత్నిస్తే దొరికిపోతామనే భయంతోనో, లేక చట్టపరమైన చిక్కులు వస్తాయనో ఇలా గాలికి వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget