Electricity Charges Hike: తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు! యూనిట్ ధర ఎంత అంటే?
తెలంగాణలో విద్యుత్ షాక్ ఖాయంగా కనిపిస్తోంది. ఈఆర్సీ ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరిస్తే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఛార్జీల మోత మోగనుంది.
తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. పెంపును ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ నియంత్రణ సంస్థ(Electricity Regulatory Commission) నివేదించింది. డిస్కంల వినతి మేరకు 14శాతం మేర ఛార్జీలు పెంచుతూ ఆదేశాలు ఇవ్వాలని రిక్వస్ట్ పంపించింది.
తెలంగాణ ఈఆర్సీ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం డొమెస్టిక్ మీటర్లపై యూనిట్‌కు 40 నుంచి 50 పైసల వరకు పెరగనుంది. అంటే గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్‌పై ఈ పెంపు ఉంటుంది. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
డిస్కంల అభ్యర్థన
విద్యుత్ ఛార్జీలు 19 శాతం మేర పెంచాలని డిస్కంలు ఈఆర్‌సీకి అభ్యర్థన పెట్టుకున్నాయి. కానీ ఈఆర్సీ మాత్రం 14 శాతం మేర పెంచుకునేందుకే అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రభుత్వానికి రిక్వసట్ పంపించింది. ప్రభుత్వ సూచనతో తెలంగాణ ఈఆర్‌ఎస్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ 1 నుంచి అమలు!
ఈఆర్‌ఏసీ ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించినట్టైతే కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒక నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపు ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం కోర్టులో ఉంది.
పదివేల కోట్ల నష్టాలతో
పదివేల కోట్లు రూపాయల లోటుతో డిస్కమ్‌లు నడుస్తున్నాయని డిసెంబర్‌లో ఈఆర్సీకి నివేదికలు పంపించాయి. ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని అప్పుడే సంకేతాలు ఇచ్చాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఛార్జీల పెంపు ఆలోచన చేయలేదని ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే పెంపు ఆలోచన చేస్తున్నట్టు విద్యుత్ నియంత్రణ మండలి వివరిస్తోంది.
విమర్శల పర్వం
దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న జనానికి విద్యుత్ ఛార్జీలు మరింత భారంగా మారనున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ప్రజల నడ్డి విరుస్తున్నాయని మండిపడుతోందా పార్టీ.
ఇక బీజేపీ , టీఆర్ఎస్ మధ్య ఎస్టీ రిజర్వేషన్ల మంటలు - కేంద్రమంత్రి సమాధానంతో ప్రారంభమైన రచ్చ !
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై మరోసారి కేంద్రం క్లారిటీ, లోక్‌సభలో మంత్రి కుండబద్దలు
పిల్లలూ మీరు రెడీయా! పేరెంట్స్ ఈ ఛాన్స్ మిస్ చేయకండి!
బోధన్ అల్లర్ల కేసులో న్యూ ట్విస్ట్, అసలు సూత్రధారుల్లో టీఆర్‌ఎస్ లీడర్
రాజమౌళిని డిజప్పాయింట్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్