Rajamouli - RRR: రాజమౌళిని డిజప్పాయింట్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్
రాజమౌళిని ఒక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ డిజప్పాయింట్ చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారు? రామ్ చరణ్ నటించిన ఒక సన్నివేశం గురించి ఆయన ఏమన్నారంటే...
'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ చూశారా? ట్రైలర్ చూశారా? రెండింటిలోనూ ఒక కామన్ సీన్ ఉంటుంది. అదేంటంటే... పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టిన జనాలు! ఆ జనాల్ని కొడుతూ గుంపును చెల్లాచెదురు చేస్తున్న రామ్ చరణ్. నిశితంగా గమనిస్తే... ఆ సన్నివేశంలో రామ్ చరణ్ కోపంగా కొట్టరు. ఎంతో బాధతో కొడుతున్నట్టు మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని స్టంట్ మాస్టర్ సాల్మన్ రాజ్ డిజైన్ చేశారు. నిజం చెప్పాలంటే... అది ఆయన చేయాల్సిన సీన్ కాదు. ఒక ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ చేయాల్సింది. మరి, సాల్మన్ చేతికి ఎలా వచ్చిందంటే...
హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఎవరైనా సరే... డైరెక్టుగా సెట్‌కు వచ్చి సీన్ షూటింగ్ చేయడం ఉండదు. ముందుగా డూప్ ఆర్టిస్టులతో యాక్షన్ సీన్ షూట్ చేసి దర్శకుడికి పంపిస్తారు. ఓకే అనుకుంటే షూటింగ్‌కు వెళతారు. లేదంటే... మళ్ళీ ఇంకొకటి చేయమని చెప్పడమో? లేదంటే మరొకరితో చేయడమో? చేస్తారు. అలా 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ జనాల్ని కొట్టే సీన్ సాల్మన్ దగ్గరకు వచ్చింది.
"ఆ సీన్ మ్యాగ్జిమమ్ క్రెడిట్ ఫైట్ మాస్టర్ సాల్మన్ కు ఇస్తాను. సినిమా కోసం నేను ఒక హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను తీసుకున్నాను. ఆయన స్టంట్ విజ్ (డూప్ ఆర్టిస్టులతో చేసిన ఫైట్) నాకు పంపించారు. అది చూసి డిజప్పాయింట్ అయ్యా. అసలు నచ్చలేదు. వద్దని తీసేశాను. యాక్చ్యువల్లీ... సాల్మన్ కు ఆ ఫైట్ గురించి ముందు చెప్పాను. చేస్తానని అన్నాడు. కానీ, అతడు చేయలేడని నేను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ దగ్గరకు వెళ్లాను. ఆయన డిజప్పాయింట్ చేసే సరికి... కొత్త స్టంట్ మాస్టర్ ను ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేద్దామా? అని ఆలోచిస్తున్నాను. అలా నెల గడిచింది. ఈలోపు సాల్మన్ తాను షూట్ చేసుకుని వచ్చింది చూపించాడు. విపరీతంగా ఇంప్రెస్ అయ్యాను. రెండు, రెండున్నర నెలలు కష్టపడి ఆ సీన్ డెవలప్ చేశాడు" అని రాజమౌళి వివరించారు.
ఆల్మోస్ట్ రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఆ సన్నివేశాన్ని తీసినట్టు రాజమౌళి తెలిపారు. రామ్ చరణ్ చుట్టూ ఉండే మొదటి రౌండ్ లో 30, 40 మంది ఫైటర్లు... 200 మంది ట్రైన్డ్ జిమ్ బాయ్స్... ఆ తర్వాత 500 మంది ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు... ఆ తర్వాత ట్రయినింగ్ ఇవ్వని జూనియర్ ఆరిస్టులు... మొత్తం మీద రెండు వేల మందితో ఆ సినిమా తీశారట. కనికరం లేని పోలీస్ అధికారిగా రామ్ చరణ్ ఆ సన్నివేశంలో ఇరగదీశారట. నీళ్ల లోంచి కర్రను బయటకు తీస్తే... నీళ్లు ఎలా కదులుతాయో? అదే విధంగా జనాలు కదలాలని ఫైట్ మాస్టర్ సాల్మన్ కు రాజమౌళి చెప్పారట.
Also Read: ఎన్టీఆర్ భయపడింది పులిని చూసి కాదు! - రాజమౌళి
సినిమాలో 70 శాతం స్టంట్స్ సాల్మన్ చేశాడని... రామ్ చరణ్ స్టంట్ ఒకటి బల్గేరియా నుంచి వచ్చిన జుజి అనే స్టంట్ మాస్టర్ చేశారని రాజమౌళి తెలిపారు. జుజి కెమెరా వర్క్ కూడా చూశారట. క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్స్ లో కూడా కొన్ని పార్ట్స్ కూడా చేశారట.
Also Read: 'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్ నడిపిన బండి కావాలా? అయితే ఇలా చేయండి!