Nizamabad News: బోధన్ అల్లర్ల కేసులో న్యూ ట్విస్ట్, అసలు సూత్రధారుల్లో టీఆర్‌ఎస్‌ లీడర్

బోధన్ అల్లర్ల కేసులో కీలక మలుపు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ భర్త కౌన్సిలర్ శరత్ రెడ్డి, శివసేన నాయకుడు గోపితో విగ్రహం కొనిపించినట్లు వెల్లడించిన పోలీసులు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.

FOLLOW US: 

నిజామాబాద్ బోధన్‌లో శివాజీ విగ్రహం అల్ల‌ర్ల కేసు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. శివాజీ విగ్రహం వివాదంలో టిఆర్ఎస్ కౌన్సిలర్, మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్సన్ భ‌ర్త శ‌ర‌త్ రెడ్డి చుట్టు ఉచ్చుబిగుసుకుంది. అల‌ర్ల‌ల‌కు కార‌ణ‌మైన శివాజి విగ్ర‌హం కేసులో శివ‌సేన గోపితోపాటు, మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స్ తూము ప‌ద్మ భ‌ర్త, కౌన్సిల‌ర్ శ‌ర‌త్ రెడ్డి ఇరుక్కున్నారు.

శివసేన నాయకుడు గోపితో శ‌ర‌త్ రెడ్డి  విగ్ర‌హం కొనిపించిన‌ట్లు పోలీసులు నిర్దారించారు. విగ్ర‌హం కొని శ‌ర‌త్‌కి  చెందిన రైస్ మిల్లులో ఉంచారు. ఎవ‌రు లేని స‌మ‌యంలో తెచ్చి పెట్టాల‌ని ఇరువురు ముందుగా ప్లాన్ వేసుకున్నారని తెలిసింది. అప్పటికే శివసేన నాయకుడు గోపిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గోపి అసలు విషయం బైటపెట్టారు.

గోపి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోపోలీసులు టీఆర్ఎస్ కౌన్సిలర్ శరత్ రెడ్డిపై 188,427, 153, 153A r/w 34 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. మ‌త విద్వేషాలు రెచ్చ‌గోట్ట‌డంతోపాటు, గోడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌నే సెక్ష‌న్ల‌ను యాడ్ చేశారు పోలీసులు. 

శరత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు శివాజీ విగ్రహం పెట్టించాలన్న ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది. ముందస్తుగా ఎవరికీ తెలుపకుండా శరత్ రెడ్డి ఎందుకు ఆసక్తి చూపారు అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరత్ వెనుక ఇంకెవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో కూడాల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 

శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఈ కుట్రలో ఉందని నిజామాబాద్  ముందే అనుమానించారు. శివాజీ విగ్రహాన్ని నిజామాబాద్‌జిల్లాలోని బోధన చౌరాస్తాలో ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కౌన్సిల్‌లో కొందరు అభ్యర్థించారు. దీనిపై ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే ఎప్పుడు ప్రతిష్టించాలనే విషయంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

శివాజీ విగ్రహ ప్రతిష్టపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా గోపీ అనే వ్యక్తి మాత్రం తొందర పడినట్టు చెప్పారు పోలీసకులు. శరత్‌ అనే కౌన్సిలర్ సహాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. వారం క్రితం గోపి, శరత్‌ కలిసి విగ్రహం ఏర్పాటుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. కావాలనే విగ్రహాన్ని రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారని వివరించారు. ఇది పట్టణంలో అలజడికి కారణమైందంటున్నారు పోలీసులు. 

రాత్రికి రాత్రే పట్టణంలోని ప్రధాన జంక్షన్‌లో ఎలాంటి పర్మిషన్ లేకుండా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఓ వర్గాం వ్యతిరేకించింది. అలాంటి విగ్రహం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గం ఆందోళన బాట పట్టింది. దానికి వ్యతిరేకంగా బీజేపీ, శివసేన ఆందోళన బాటపట్టాయి. బీజేపీ, శివసేన కార్యకర్తలు, మైనార్టీ నాయకులు భారీగా అంబేడ్కర్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఒక సమయంలో ఆగ్రహంతో ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపుచేసుందుకు పోలీసులను భారీగా మోహరించారు.

Published at : 23 Mar 2022 08:28 PM (IST) Tags: nizamabad Nizamabad news Nizamabad Latest News Nizamabad Updates Bodhan Issue

సంబంధిత కథనాలు

Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్‌కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్

Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్‌కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్

Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు

Nizamabad రిజిస్ట్రేషన్ శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగుల వాంగ్మూలం తీసుకున్న అధికారులు

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

CM KCR Appreciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Appreciates Nikat Zareen : విశ్వ విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్ హర్షం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా