అన్వేషించండి

Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు.. చోరీలు, హత్యలు చేస్తున్న కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్

Constable Betting Debts in Siddipet ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో లక్షల రూపాయలు పోవడం, అప్పులు పెరగడంతో హత్యలు చేసి క్యాష్ రికవరీ చేసుకుంటున్నారు కానిస్టేబుల్ దంపతులు.

Online Betting Case | సిద్దిపేట జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్స్ వ్యసనం ఓ పోలీసు కానిస్టేబుల్‌ను హంతకుడిగా మార్చింది. భార్యతో కలిసి ఆన్‌లైన్ బెట్టింగ్స్ పెట్టి భారీగా నష్టపోయాడు. ఓ వైపు అప్పులు, మరోవైపు నష్టాలు పెరిగిపోవడంతో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని భావించారు. చివరకు హత్య చేసి జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు.

సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం... సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరుకు చెందిన గౌటి ప్రవీణ్‌కుమార్‌ 2007లో పోలీస్ శాఖలో చేరగా, ప్రస్తుతం సీసీఎస్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల కిందట రజితతో వివాహం జరిగింది. గత రెండేళ్లుగా తన భార్య రజితతో కలిసి ఆన్‌లైన్ బెట్టింగ్స్ వేస్తున్న ప్రవీణ్ దాదాపు రూ.60 లక్షల వరకు నష్టపోయాడు. మరోవైపు అప్పుడు సైతం పెరిగిపోయాయి. దాదాపు రూ.30 లక్షల మేర అప్పులు కావడంతో వాటిని తీర్చేందుకు అడ్డదారిని ఎంచుకున్నారు. అందుకోసం హత్యలు చేయడానికి కూడా ఈ భార్యభర్తలు వెనుకాడటం లేదు. 

రియల్ ఎస్టేట్ వ్యాపారిని నమ్మించి తీసుకెళ్లి హత్య..

స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి బెల్దె విశ్వనాథం(57)ను లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో ఒక ప్లాటు విషయంలో విశ్వనాథంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న ప్రవీణ్, మరో ప్లాటు చూపిస్తానని నమ్మించి గత శనివారం ఆయనను తమ కారులో మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే విశ్వనాథం కాళ్లు, చేతులు కట్టేసి, మెడకు వైరు బిగించి భార్య రజితతో కలిసి విశ్వనాథంను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇమాంబాద్‌ వద్ద కాలువలో పడేశారు. విశ్వనాథం వద్ద ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని హైదరాబాద్‌లో అమ్మేసి క్యాష్ చేసుకున్నారు. 

విశ్వనాథం కనిపించకపోవడంతో ఆయన భార్య వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులకు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ ఫుటేజీ, టెక్నాలజీ   సహాయంతో నిందితులను గుర్తించారు పోలీసులు. కానిస్టేబుల్ ప్రవీణ్, అతని భార్య రజిత ఈ హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసు టీంను కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.

తాళి చోరీ చేసిన కానిస్టేబుల్ దంపతులు
హత్య కేసులో అరెస్టయిన కానిస్టేబుల్ ప్రవీణ్, అతని భార్య రజిత అంతకుముందే మరో తప్పు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఏప్రిల్ 25న తమ ఇంటి సమీపంలోనే నివసించే బొడ్డు నర్సవ్వ అనే వృద్ధురాలికి  అనారోగ్యంగా ఉందని నమ్మించి, ఆసుపత్రికి తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో ఆమెకు డౌట్ రాకుండా మెడలోని తాళి దొంగిలించారు.

ఈ చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్‌లో అమ్మగా దాదాపు రూ.5 లక్షల వరకు వచ్చాయి. ఆ మొత్తాన్ని కూడా కానిస్టేబుల్ ప్రవీణ్ దంపతులు ఆన్‌లైన్ బెట్టింగ్‌లోనే పెట్టి పోగొట్టారు. తమకేం తెలియదు అని నిరూపించుకునేందుకు మరుసటి రోజు ప్రవీణ్ స్వయంగా బాధితురాలిని తీసుకుని వెళ్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు.  పోలీసు అయి ఉండి, నేరం చేసి మళ్ళీ బాధితురాలి వెంటే ఉండి డ్రామా ఆడటం స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Embed widget