అన్వేషించండి

CM KCR: ఆ రోజులు పోయాయి, ఇప్పుడు పని చేసేవాడికే గుర్తింపు, అభివృద్ధే గెలిపిస్తుంది: సీఎం కేసీఆర్

CM KCR: తాతలు, తండ్రుల పేర్లు చెబితే ప్రజలు ఓట్లేయరని, అస్సలు పట్టించుకునే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మనం చేసిన అబివృద్ధే మనల్ని గెలిపిస్తుందంటూ కామెంట్లు చేశారు. 

CM KCR: పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంత కర్తలు, తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఓట్లేయమంటే ప్రజలు పట్టించుకునే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలకు పేర్లతో పని లేదని. పని చేయగల్గిన వాళ్లతోనే పని అంటూ చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తును నాశనం చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆదివారం ప్రగతి భవన్ లో మధ్య ప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సహా 200 మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాంద్వాడా జిల్లా జున్నార్ దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్ దాస్ యికే, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ ముస్కోలే తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ప్రకృతి వనరులు అన్నీ ఉన్నా.. రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు!

దేశంలో వ్యవసాయం చేసేందుకు కావాల్సిన ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని.. అయినా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే  రైతులకు బతుకులు ఇలా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాల ప్రజలు అప్పటికీ అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే... పార్టీలు, వాటి నాయకుల పేర్లే మారుతాయని అన్నారు. ప్రజలకు ఒరిగేదేమీ లేదని.. పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు

బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. దేశాన్ని మార్చేందుకు ఏర్పాటు చేసిన ఒక మిషన్ అని వెల్లడించారు. మన కోసం పని చేసుకునే వారికి ఓటు వేస్తేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మధ్యప్రదేశ్ లో ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. ఆదివాసీలు, దళితులు, బహుజనులు పీడితులుగానే కొనసాగే దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆ వర్గాల వారు ఉత్తర భారతంలో కనీస జీవన ప్రమాణాలకు నోచుకోకుండా వివక్షకు గురవుతున్నారని తెలిపారు. తప్పుడు వాగ్దానాలతో, విద్వేషాలు రెచ్చగొడుతూ ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారానే ఆ రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి తమ పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని కొత్తగా చేరిన నేతలకు సూచించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget