Car On wall : గోడ ఎక్కిన కారు - ఎంత తాగితే మాత్రం అలా ఎలా నిలబెట్టావురా అయ్యా !
Car Accident: హైదరాబాద్ ఓ కారు అదుపు తప్పి గోడ ఎక్కి కూర్చుంది. ఆ కారు అక్కడికి ఎలా వెళ్లిందో.. చాలా మంది ఊహించలేరు. ఎందుకంటే ఆ గోడ అంత ఎత్తులో ఉంది మరి.

Car lost control and Stop on wall : యమలీల సినిమాలో గోడ మీద పిడకలు చూసిన చిత్రగుప్తుడు.. అసలు అక్కడకు వెళ్లి అవు ఎలా పేడ వేసిందా అని అనుమానపడతాడు. అదే అనుమానాన్ని ఓ మానవుడి వద్ద వ్యక్తం చేస్తే అతను చూసే చూపులకు అర్థం వెదుక్కోవడం కష్టం. ఇక్కడ చిత్ర గుప్తుడు లేడు.. ఓ మానవుడు లేడు కానీ.. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట్ - శంభీపూర్ రహదారిలో ఉదయమే వెళ్తున్న వారిని ఓ దృశ్యం ఆశ్చర్య పరిచింది. రోజూ వెళ్లే దారిలో ఓ ఎత్తైన గోడ ఉంటుంది. కానీ ఆ గోడ మీద ఎప్పుడూ కారు ఉండేది కాదు. కానీ శుక్రవారం ఉదయమే ఓ కారు గోడ మీద ఉంది. గోడ మీద కారు ఉండటం ఏమిటా అని అందరికీ ఆశ్చర్యమే. విచిత్రంగా చూస్తున్నారు.
గోడ ఆరేడు అడుగులు ఉంటుంది. అది కూడా.. మనిషి నడవడానికి కూడా బ్యాలెన్స్ కష్టమయ్యేంత వెడల్పుమాత్రమే ఉంటుంది. కానీ కారు మాత్రం ఆ గోడ మీద దర్జాగా ఉంది. సరే ఎలాగోలా బ్యాలెన్స్ చేసి నిలబెట్టారు అనుకుందాం.. అనుకుంటే.. అసలు అక్కడ కారు నిలబెట్టాల్సిన అవసరం ఏమిటన్నది చాలా మందికి వస్తున్న డౌట్. ఏదైనా సినిమా షూటింగ్ లో భాగంగా.. స్టంట్ కోసం.. క్రేన్ తో అలా కారుని ఎత్తి పెట్టి.. షూటింగ్ అయిపోయాక తీయడం మానేశారా అని ఆరా తీశారు. అలాంటి షూటింగ్ ఏమీ జరగలేదని తేలింది. మరి ఆ ఆ కారు అక్కడికి ఎలా వెళ్లింది?
*ఇంటి ప్రహరీ గోడపై ఎక్కిన కారు*
— Sanjay Journalist (@SanjuJournalist) July 25, 2025
హైదరాబాద్ లోని దుండిగల్ లో కారు బీభత్సం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఎగిరి సమీపంలోని ఇంటిగోడపై పడింది.
ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందకు దించారు.#hyderabad #cars pic.twitter.com/cZa80vNu5s
పోలీసులు వచ్చి ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. తెల్లవారుజామున ఓ డ్రైవర్ నిద్ర మత్తులోనో.. మద్యం మత్తులోనే ఉండటంతో ఉండటంతో కారు అదుపు తప్పి గోడ పైకి కారు ఎక్కింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఆ కారు అదుపు తప్పి నేరుగా గోడను ఢీకొన్నట్లయితే చాలా ప్రమాదం జరిగేది. అలాంటిది జరగలేదు. వేగంగా వస్తూ ఉండటం.. స్పీడ్ బ్రేకర్ లాంటిదాన్ని బలంగా తాకడంతో ఒక్క సాగి గాల్లోకి ఎగిరింది.. అలా ఎగిరి కింద పడినా చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ అలా ఎగిరి గోడ మీద కూర్చోవడంతో.. ప్రమాదం త్పపింది.
స్థానికుల సమాచారంతో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు క్రైన్ సహాయంతో కారును కిందకు దింపించారు.





















