MLCKavitha: కేసీఆర్‌ను, బీఆర్ఎస్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి తరం కాదు- ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Hyderabad Regional Ring Road | ఎన్నికల హామీల ప్రకారం మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.

BRS MLC Kavitha | ఖమ్మం సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత, డిసిసిబి డైరెక్టర్ లక్కినేని సురేందర్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్ పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులతో బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయవచ్చు.. కానీ కేసీఆర్ సైన్యాన్ని నిలువరించడం, అడ్డుకోవడం వారి తరం కాదు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కారణంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది.
అక్రమ కేసులకు భయపడేది లేదు
అక్రమ కేసులతో కేసిఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. కానీ కేసీఆర్‌ను, ఆయన సైన్యాన్ని కట్టడి చేయడం ప్రభుత్వం తరం కాదు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలు రాష్ట్ర ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయి. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరు. 14 నెలల పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై కన్నెర్ర జేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. పథకాలు అందించడం చేతకాక, ప్రభుత్వం నడపడం చేతగాక బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. అక్రమ కేసులకు బీఆర్ఎస్ శ్రేణులు తలొగ్గేదే లేదు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పడూ ఎండగడుతూనే ఉంటాం’ అన్నారు.
తక్షణమే RRR బాధితుల సమస్యను పరిష్కరించాలి
ఖమ్మంలో జరిగే బీసీ సంఘాల రౌండు టేబుల్ సమావేశానికి బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్గమధ్యంలో మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మమ్మల్ని గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తాము, మీ గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
గెలిచి 14 నెలలు అవుతున్నా ఇంతవరకు వారి సమస్యను పరిష్కరించలేదు. సమస్య పరిష్కారం కోసం బాధితులు ధర్నాలు, నిరసనలు చేపట్టినా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించకపోవడం దారుణం అని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు నిలబడి తక్షణమే ట్రిపుల్ ఆర్ బాధితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

