By: ABP Desam | Updated at : 12 Mar 2023 10:39 AM (IST)
హైదరాబాద్‌లో ఏర్పాటైన ఫ్లెక్సీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వేళ ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. నిన్న (మార్చి 11) అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు. ఇదే రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత ఈడీ విచారణ కూడా జరిగింది. దీంతో అమిత్ షా పర్యటనకు ముందే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ తరఫున కొన్ని పోస్టర్లు అతికించగా, అందులో ఓ వైపు కవిత, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్న నేతల చిత్రాలు కనిపించాయి. విపక్ష నేత బీజేపీలో చేరితే అతనిపై ఎలాంటి విచారణ జరగబోదని, దానికి విరుద్ధంగా మరక నుంచి క్లీన్ అవుతారని ఈ పోస్టర్‌లో చూపించారు. హోర్డింగ్‌లో వాషింగ్ పౌడర్ నిర్మా.. వెల్‌కమ్ టూ అమిత్ షా అంటూ రాసుకొచ్చారు. అలాగే, బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాధియ సింధియా సహా పలువురు నేతల ఫొటోలు పెట్టారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా హోర్డింగ్స్ పెట్టారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితను శనివారం ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఆ కేసును కవితపై మోపడానికి వ్యతిరేకంగా బీజేపీపై బీఆర్‌ఎస్ పార్టీ నేతలు అసలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అమిత్ షా హైదరాబాద్ కు రానుండడంతో వినూత్నంగా పోస్టర్లతో ఇలా నిరసనలు తెలిపారు.
Amid ongoing questioning of BRS MLC K Kavitha in the Delhi liquor case, another poster featuring leaders who joined BJP from other parties is seen in Hyderabad as Union Home Minister Amit Shah attends the CISF Raising Day event in the city today pic.twitter.com/5fIi0az6Zq
— ANI (@ANI) March 12, 2023
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
TS SSC Exams: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ!
TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!
“ఆరోగ్య మహిళ" స్కీమ్ అంటే ఏంటి? ఏయే టెస్టులు చేస్తారో తెలుసా
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్, చర్లపల్లి జైలుకు నిందితుల తరలింపు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల