72nd Miss World Grand Finale : నేడే 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే.. ఫైనలిస్ట్ జాబితాలో నందిని గుప్తా, ప్రపంచ సుందరిని ఎంచుకునే విధానమిదే
Miss World Grand Finale : ప్రపంచ సుందరి ఎంపిక మరికొన్ని గంటల్లో జరగనుంది. దానిలో భాగంగానే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైలెట్స్ ఏంటో.. ఈవెంట్‌ని ఎలా ప్లాన్ చేశారో ఇప్పుడు చూసేద్దాం.

72nd Miss World Grand Finale Highlights : 72వ ప్రపంచ సుందరి టైటిల్ ఎవరు గెలుచుకుంటారోనని.. మొత్తం వరల్డ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అలాంటి పోటీలకు హైదరాబాద్ మొట్టమొదటిసారి వేదికగా నిలిచింది. తెలంగాణలో దాదాపు నెలరోజులు ట్రెడీషనల్ పోటీలు ఎదుర్కొన్న 108 మంది మిస్ వరల్డ్ పోటీదారులు.. చివరి ఘట్టానికి చేరుకున్నారు. 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో తమ దేశాన్ని రిప్రెజెంట్ చేస్తూ టైటిల్ గెలుచుకునేందుకు ఎదురు చూస్తున్నారు.
మిస్ వరల్డ్ ఫెస్టివల్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌ను ఈరోజు అంటే మే 31వ తేదీన మధ్యాహ్నం 1:00 GMT (6:30 PM IST)కి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఈ ఈవెంట్‌పై ఉండడంతో దీనిని లైవ్ కూడా అందిస్తున్నారు. అందం, ఐక్యతే ప్రధాన లక్ష్యంగా పోటీ పడుతున్న ఈ వేడుకల్లో మిస్ వరల్డ్ కిరీటం ఎవరు దక్కించుకుంటారో.. ఈ ఈవెంట్లో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ఈవెంట్ హైలెట్స్..
మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కానుంది. 2016లో మిస్ వరల్డ్ పొందిన స్టెఫానీ డెల్ వల్లే, ఇండియన్ ప్రెజెంటర్ సచిన్ కుంభార్తో కలిసి ఈవెంట్‌కి హోస్ట్‌గా చేయనున్నారు. బాలీవుడ్ తారలైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు సోను సూద్ ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ హ్యుమనిటేరియన్ అవార్డును అందుకోనున్నారు.
న్యాయనిర్ణేతలు వీళ్లే..
సోను సూద్ అవార్డ్ అందుకోవడమే కాదు.. మిస్ వరల్డ్ న్యాయమూర్తుల్లో ఒకరిగా వ్యవహరించున్నారు. మరో జడ్జ్‌గా ప్రముఖ వ్యాపారవేత్త సుధా రెడ్డి వ్యవహరించనున్నారు. ఈమె 2025 మిస్ వరల్డ్ పోటీల్లో బ్యూటీ విత్ ఎ పర్పస్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా చేశారు. మిస్ ఇంగ్లాండ్ 2014 అయినా డాక్టర్ కారీనా టర్రెల్ కూడా జడ్జింగ్ ప్యానెల్లో ఉన్నారు.
ప్రస్తుత మిస్ వరల్డ్(2024) క్రిస్టినా పిజ్కోవా.. 2025 మిస్ వరల్డ్‌ని ఎంచుకోవడం హెల్ప్ చేస్తారు. మిస్ వరల్డ్ చైర్‌వుమెన్ జూలియా మోర్లీ ఈ జ్యూరీకి నాయకత్వం వహించి.. 72వ మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు. ఈ ఈవెంట్లో 2017లో ఇండియాకు ప్రపంచ సుందరి టైటిల్ అందించిన మానుషి చిల్లర్ కూడా హాజరు కానున్నారు.
మిస్ వరల్డ్ ఎంపిక ఎలా ఉంటుందంటే..
మిస్ వరల్ట్ పోటీదారులైన 108 మంది ముందు ప్రపంచానికి తమని తాము ప్రెజెంట్ చేసుకుంటారు. అనంతరం అమెరికాస్ & కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానియా నుంచి పది మంది సెమీఫైనలిస్టులు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటారు. అయితే ఫాస్ట్ ట్రాక్ పోటీల ద్వారా ఇప్పటికే పదహారు మంది పోటీదారులు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.
పదహారు మంది ఫైనలిస్ట్‌లు వీరే
- అన్నా లిస్ నాంటన్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో, ఆరేలీ జోచిమ్ టాప్ మోడల్‌గా, వలేరియా పెరెజ్ బ్యూటీ విత్ ఎ పర్పస్, మైరా డెల్గాడో మల్టీ మీడియా అవార్డు ద్వారా అమెరికాస్ & కరేబియన్ నుంచి ఎంపికయ్యారు.
- ఫెయిత్ బ్వాల్యా హెడ్ టు హెడ్ ఛాలెంజ్, సెల్మా కమన్యా టాప్ మోడల్, నటాషా న్యోన్యోజి బ్యూటీ విత్ ఎ పర్పస్, ప్రిన్సెస్ ఇస్సీ మల్టీమీడియా అవార్డ్‌ను అందుకొని ఆఫ్రికా తరఫున ఫైనలిస్ట్‌లు అయ్యారు.
- యూరప్ నుంచి స్పోర్ట్స్ ఛాలెంజ్‌లో ఎలిస్ రాండ్మా, బ్యూటీ విత్ ఎ పర్పస్‌లో మిల్లీ మే ఆడమ్స్, టాప్ మోడల్‌గా జాస్మిస్ గెర్హార్డ్ట్, మల్టీమీడియా నుంచి ఆండ్రియా నికోలిక్ ఎంపికయ్యారు.
- ఆసియా & ఓషియానియా నుంచి మోనికా కెజియా సెంబిరింగ్ టాలెంట్ అండ్ బ్యూటీ విత్ ఏ పర్పస్‌లో, ఇడిల్ బిల్జెన్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్‌లో, నందిని గుప్తా ఇండియా టాప్ మోడల్‌గా, ఒపాల్ సుచాటా మల్టీమీడియా అవార్డు అందుకొని ఫైనలిస్ట్‌లుగా నిలిచారు.
ప్రతి కాంటినెంట్ నుంచి 10 మంది క్వార్టర్ ఫైనలిస్ట్‌లు, తర్వాత టాప్ 5, తర్వాత టాప్ 2, చివర్లో నలుగురు కాంటినెంటల్ విజేతలు ఫైనల్ అవుతారు. వారిలో మిస్ వరల్డ్ ఎంపిక అవుతుంది. గతేడాది 71వ మిస్ వరల్డ్, ప్రస్తుత టైటిల్ హోల్డర్ క్రిస్టినా పిజ్కోవా.. కొత్తగా ఎంపికైనా 72వ మిస్ వరల్డ్‌కు కిరీటాన్ని అలంకరించడంతో కార్యక్రమం ముగియనుంది. ఈ కార్యక్రమాన్ని ఇండియాలో చూడాలనుకునేవారు SonyLivలో లైవ్‌లో చూడొచ్చు. ఎంపికైన దేశాలు.. నేషనల్ మీడియాలో ఈ టెలికాస్ట్‌ను చూడొచ్చు. లేదంటే www.watchmissworld.com వెబ్సైట్లో హై డెఫినిషనల్లో చూడొచ్చు.






















