Nandini Gupta Miss World 2025 : మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాను రిప్రెజెంట్ చేస్తోన్న నందిని గుప్తా.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
Nandini Gupta : మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది నందిని గుప్తా. మరి ఈ అందాల భామ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

Miss World India representative Nandini Gupta : ప్రపంచ సుందరి 2025 పోటీల(72nd Miss World competition)కు హైదరాబాద్ వేదికైంది. పలు దేశాల నుంచి అందమైన భామలు తమ దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ పోటీల్లో పాల్గొననున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఇండియాకు నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ భామ గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు. అయితే అసలు ఈ నందిని గుప్తా ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె వరల్డ్ పోటీల వరకు ఎలా వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నందిని గుప్తా స్టడీ
నందిని గుప్తా రాజస్థాన్‌కి చెందిన యువతి. ఈ భామ చిన్న నాటి నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తండ్రి సహకారంతో ఫ్యాషన్‌పై తనకున్న మక్కువను పెంచుకుంటూ.. దానికి తగ్గట్టు తనని తాను మార్చుకుంది. అలా అని చదువును నెగ్లెక్ట్ చేయలేదట ఈ భామ. ప్రస్తుతం ముంబైలో ఉన్న లాలా లజ్‌పత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తుంది.
మిస్ వరల్డ్ డ్రీమ్ వెనక రీజన్..
ఓ సందర్భంలో నందిని తన తల్లితో కలిసి ఐశ్వర్య రాయ్‌ని చూసిందట. ఐశ్వర్య అందానికి నందిని ఫిదా అయిపోయి.. ఆమె ఎవరు అంటూ తల్లిని అడిగిందట. ఆమె ఐశ్వర్య రాయ్. మిస్ వరల్డ్ అని చెప్పిందట. అప్పుడే నేను కూడా మిస్ వరల్డ్ అవుతానని చెప్పిందట నందిని. అప్పటి నుంచి తనకు మిస్ వరల్డ్ అవ్వాలనే కోరిక మొదలైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నందిని.
ప్యాషన్‌తో ఫ్యాషన్ రంగంలోకి..
చిన్నతనంలోనే మొదలైన మిస్ వరల్డ్ సీడ్.. ఆమెను ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపునకు నడిపించింది. 10 ఏళ్ల నుంచి తనకి దీనిపై ఆసక్తి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్లు సిద్ధమై.. 19వ ఏట ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. రాజస్థాన్‌ను రిప్రజెంట్ చేస్తూ 2023లో ఈ అవార్డును గెలుచుకుంది. ఇదే క్రమంలో 72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది.
ప్రాజెక్ట్ ఏకతా..
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే భామలు.. కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో కచ్చింతగా యాక్టివ్‌గా ఉండాలి. దీనిలో భాగంగా నందిని ప్రాజెక్ట్ ఏకతా పేరుతో వికలాంగులకు సేవ చేస్తుంది. వికాలంగులకు సమానతను అందించడమే దీని లక్ష్యం. ప్రతి ఒక్కరిని వారి ప్రత్యేకతల ద్వారా గుర్తించాలి కానీ.. లోపాల ద్వారా కాదు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఈ భామ.
మిస్ వరల్డ్ ఈవెంట్..
మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో మే 7వ తేదీన మొదలై.. మే 31వరకు కొనసాగనున్నాయి. ప్రపంచ సుందరి పోటీలకు వరుసగా రెండోసారి ఆతిథ్యం ఇస్తోంది భారత్. ఈ ఈవెంట్లో ఇండియాకు నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పటివరకు 6 ఇండియన్ బ్యూటీలు మిస్ వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. నందిని గుప్తా ఈ టైటిల్ గెలవాలని ఇండియన్స్ కోరుకుంటున్నారు.






















