71వ మిస్ వరల్డ్ విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పిస్కోవా టైటిల్‌ను గెలుచుకుంది. ఈ భామ లా, బిజినెస్‌లో రెండు డిగ్రీలు చదువుతూ మోడల్‌గా కూడా పనిచేస్తోంది క్రిస్టినా చదువు, మోడలింగ్‌తో పాటు పలు స్వచ్ఛంద సేవల్లో కూడా పాల్గొంటుంది. 24 ఏళ్ల క్రిస్టినా ఇంగ్లీష్, పోలిష్, స్లోవాక్, జర్మన్ భాషలను మాట్లాడగలుగుతుంది. క్రిస్టినా పిస్కోవా టాలెంటెడ్ యువతి మాత్రమే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కూడా. పేద పిల్లల కోసం క్రిస్టినా పిస్కోవా అనే ఫౌండేషన్‌ను కూడా స్థాపించింది. టాంజానియాలో పేద పిల్లల చదువు కోసం ఇంగ్లీష్ స్కూల్‌ను ప్రారంభించింది. టాంజానియాలోని స్కూల్లో క్రిస్టినా స్వచ్ఛందంగా పనిచేస్తుంది. పిల్లలకు పాఠాలు చెప్తోంది. ఫ్లూట్, వయోలిన్ ప్లే చేయడం అంటే క్రిస్టీనాకు చాలా ఇష్టం.