పిల్లలు చాలా సార్లు తల్లిదండ్రులను చూసే తమ అలవాట్లను ఏర్పరుచుకుంటారు.

మీకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉంటే.. వారు కూడా మిమ్మల్నే ఫాలో అవుతారు.

ఇంట్లో ఆరోగ్యకరమైన పండ్లు, గింజలు, కూరగాయలు, యోగర్ట్ వంటి స్నాక్స్ అందుబాటులో ఉంచాలి.

వీలున్నప్పుడల్లా పిల్లలను ఇంట్లో ఏం వండుకుందామని వారి అభిప్రాయాలు అడగాలి.

కిరాణా సామాను, కూరగాయలు, పండ్లు కొనేందుకు వారిని కూడా మార్కెట్ కు తీసుకుపోవాలి.

పోషకాహారపు ప్రాధాన్యత గురించి పిల్లలకు అవగాహన కలిగించాలి.

పోషకాలు కలిగిన ఆహారానికి, జంక్ ఫుడ్ కి మధ్య తేడాలను వివరించాలి.

అప్పుడప్పుడు పార్టీలు పర్వాలేదు. కానీ జంక్ ఫూడ్ మీద అదుపు ఉండాలి. అలవాటుగా మార్చుకోకూడదు.

Images Credit: Pexels