ఎక్కువగా ఏసీలో ఉంటున్నారా? అయితే, జాగ్రత్త! రోజులో ఎక్కువ సేపు ఏసీలో ఉండటం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఏసీలో ఎక్కువ సేపు ఉండడం వల్ల మనకు తెలియకుండానే చిన్నగా వణుకు పుడుతుంది. ఏసీ కారణంగా శరీంలో ఏర్పడే వణుకు గుండెకు అంత మంచిది కాదు. రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు రక్త ప్రవాహానికి అడ్డుగా వచ్చి గుండె పోటుకు కారణం అవుతాయి. నిత్యం ఏసీలో ఉండే వాళ్లకి ఊపిరితిత్తుల సమస్యలు త్వరగా వస్తాయి. ఏసీలో ఎక్కువ సేపు ఉండే వారికి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఏసీ కారణంగా చర్మం పొడి బారే సమస్య పెరుగుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All photos Credit: Pixels.com