మీ పిల్లలు పరీక్షలు బాగా రాయాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. అందుకు ఈ ఆహారం తినిపించండి. టూనా, సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా3 ఫ్యాటీఆసిడ్లు ఉంటాయి. ఒమెగా3 మెదడు, నాడీ కణాల పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తి పెంపొందిస్తాయి. పసుపులో ఉండే కర్క్యూమిన్ వల్ల మానసిక, మేథో సామర్థ్యం పెరుగుతుంది. బాదాములు, అక్రూట్ వంటి గింజల్లో ఆవశ్యక కొవ్వులు ఉంటాయి. ఇవి మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్రొకొలిలో విటమిన్ K, బీటాకెరోటిన్, ఫోలెట్ ఉంటాయి. ఇవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మెదడు కణజాలాల మధ్య కమ్యూనికేషన్‌ను పెంచుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.