అన్వేషించండి

TGREDCO DE Venkata Ramana ACB Raid: మరో అవినీతి అధికారి అక్రమాస్తులు వంద కోట్లపైనే - టీజీ రెడ్కో డీఈ ఇంట్లో ఆస్తుల కుప్ప !

Telangana ACB Raid TGREDCO DE:తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు.ఆయన ఆస్తులు కూడా బహిరంగ మార్కెట్‌లో వంద కోట్లకుపైగా ఉంటాయి.

Muthyam Venkata Ramana ACB Case:  తెలంగాణ రెడ్కో డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ అక్రమార్జన పర్వం ఏసీబీ దాడుల్లో బట్టబయలైంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ  అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఆయన నివాసంతో పాటు కార్యాలయం, బంధువులు, సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలువడిన ఆధారాలు, స్వాధీనం చేసుకున్న పత్రాలను చూసి ఏసీబీ అధికారులే దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఏసీబీ ప్రాథమిక అంచనాల ప్రకారం.. డీఈ వెంకటరమణకు చెందిన సుమారు 27.65 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇవన్నీ ప్రభుత్వ రేట్ల ప్రకారం. మార్కెట్ రేట్ల ప్రకారం వంద కోట్ల కన్నా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు.   గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో ఆధారాలు లభించాయి. మూసాపేట ఆంజనేయనగర్‌లో 20 కోట్ల అంచనా పెట్టుబడితో నిర్మాణంలో ఉన్న 10 నివాస అపార్ట్‌మెంట్లు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో అధికారిక విలువ ప్రకారమే  1.23 కోట్ల విలువైన 4 ఫ్లాట్లు, కూకట్‌పల్లి ఆంజనేయనగర్‌లో  1.82 కోట్ల విలువైన G+3 వాణిజ్య సముదాయం, గుట్టల బేగంపేటలో  2.90 కోట్ల విలువైన G+5 కమర్షియల్ బిల్డింగ్‌ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. 

కేవలం భవనాలు, స్థలాలు మాత్రమే కాకుండా తన భార్య పేరిట 4 నిర్మాణ సంస్థలను  రిజిస్టర్ చేసి నిధులను మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సోదాల సందర్భంగా వెంకటరమణ ఇల్లు, ఇతర ప్రాంగణాల నుంచి భారీగా ప్రాపర్టీ పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు  4 కోట్ల విలువైన 2.094 కిలోల బంగారు ఆభరణాలు,  52.02 లక్షల బ్యాంక్ డిపాజిట్లు,  45 లక్షల విలువైన 3 విలాసవంతమైన వాహనాలు,  30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు 20 మద్యం సీసాలను ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి.  

ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ తన అధికారిక పరిధిని దుర్వినియోగం చేస్తూ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని, విచారణ పురోగమించే కొద్దీ మరిన్ని షెల్ కంపెనీలు, బినామీ ఆస్తుల కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులు, భాగస్వాముల పాత్రపై కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు  నమోదు చేసిన ఏసీబీ అధికారులు, డీఈ ముత్యం వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క ప్రభుత్వ అధికారి వద్ద ఈ స్థాయిలో కోట్ల రూపాయల ఆస్తులు, బంగారం బయటపడటం తెలంగాణ ఉద్యోగ వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget