అన్వేషించండి

ACB Raids On DSP Bheem Reddy: ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !

DSP Bheem Reddy : సైబరాబాద్ డీఎస్పీ భీంరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ సహా 20 ప్రాంతాల్లో ప్రత్యేక సోదాలు జరుగుతున్నాయి.

Telangana ACB Institutional Corruption Crackdown.  తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాల వేటను అవినీతి నిరోధక శాఖ   మరింత వేగవంతం చేసింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల  ఆరోపణలతో సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ డీఎస్పీ భీంరెడ్డిని టార్గెట్ చేస్తూ ఏసీబీ అధికారులు గురువారం   తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున మెరుపు దాడులకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ఆయన ప్రధాన నివాసంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సుమారు 20 ప్రాంతాలలో ఏసీబీ బలగాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుండటం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

 ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్   నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ దాడులలో పాల్గొన్నాయి. భీంరెడ్డి సుదీర్ఘ పోలీస్ సర్వీస్‌లో వివిధ కీలక స్థానాల్లో పనిచేసిన కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారం, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగానే ఏసీబీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఒక అత్యంత విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో సుమారు రూ. 8 కోట్ల మార్కెట్ విలువ గల విల్లాలో డీఎస్పీ భీంరెడ్డి నివాసం ఉంటున్నట్లు సోదాల ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. 

కోట్లలో బినామీ ఆస్తులు?

ప్రాథమిక సమాచారం ప్రకారం.. భీంరెడ్డి నివాసాలు, ఆయన బంధువులు, అత్యంత ఆప్తులకు చెందిన బినామీ ఇళ్లలో జరుపుతున్న తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమాస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 

ఈ సోదాల్లో కేవలం స్థిరాస్తుల పత్రాలే కాకుండా.. భారీగా పట్టుబడిన నగదు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీ ,  లగ్జరీ కార్ల విలువలపై ఏసీబీ ఇన్వెంటరీని సిద్ధం చేస్తోంది. ఆయన బ్యాంక్ లాకర్లను, ఐటీ రిటర్న్స్ ఫైళ్లను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భీంరెడ్డి తన అధికారిక ఆదాయ వనరుల కంటే వందల రెట్లు అదనంగా ఈ ఆస్తులను సంపాదించినట్లు ఏసీబీ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న ఆస్తుల అధికారిక విలువల లెక్కలను ఏసీబీ ఉన్నతాధికారులు ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేయనున్నారు.                

రాష్ట్రంలో అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో.. ఏకంగా పోలీస్ శాఖలోని ఒక ఉన్నతాధికారి నివాసాలపై ఈ స్థాయిలో దాడులు జరగడం వ్యవస్థలో ఉన్న లొసుగులను బట్టబయలు చేస్తోంది. ఖాకీ చొక్కా అండతో అక్రమ సంపాదనకు తెరలేపిన డీఎస్పీ భీంరెడ్డి లీగల్ ట్రాప్‌లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. సోదాలు పూర్తిగా ముగిసిన అనంతరం భీంరెడ్డిని అధికారికంగా అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించేందుకు అధికారులు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేశారు. ఈ మెరుపు దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ మరోసారి రైళ్లు పరిగెత్తించింది.                   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget