Speaking Telugu Punishable : తెలుగులో మాట్లాడితే శిక్షిస్తాం, ఓ ప్రైవేట్ స్కూల్ వింత రూల్!
Speaking Telugu Punishable : తెలుగులో మాట్లాడితే శిక్షిస్తామని ఓ ప్రైవేట్ స్కూల్ బోర్డు పెట్టింది. ఈ బోర్డు చూసిన ఐపీఎస్ అధికారి స్కూల్ యాజమాన్యానికి ట్విట్టర్ లో చురకలు అంటించారు.
![Speaking Telugu Punishable : తెలుగులో మాట్లాడితే శిక్షిస్తాం, ఓ ప్రైవేట్ స్కూల్ వింత రూల్! Hyderabad IPS Officer tweet private school board Speaking telugu punishable Speaking Telugu Punishable : తెలుగులో మాట్లాడితే శిక్షిస్తాం, ఓ ప్రైవేట్ స్కూల్ వింత రూల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/24/d27b139167b12410257e23575f1d9af61677244835183235_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Speaking Telugu Punishable : దేశ భాషలందు తెలుగు లెస్స అనేది నానాటికీ నానుడిగా మాత్రమే నిలిచిపోతుంది. రోజు రోజుకూ తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంగ్లిష్ భాషపై మోజుతో తెలుగు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంగ్లిష్ మాట్లాడితేనే భవిష్యత్ అనే భావనలో తెలుగు నేర్చుకోవడంలో శ్రద్ధ చూపడంలేదని నేటితరం. ఉద్యోగానికి వెళ్తే ముందు ఇంగ్లిష్ వచ్చా అని అడుగుతుండడంతో యువత అటుగా అడుగులు వేస్తూ తెలుగును ఇంటికే పరిమితం చేస్తున్నారు. దేశంలో హిందీ తర్వాత తెలుగు మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉండేవాళ్లు. గత 50 ఏళ్లలో రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి తెలుగు భాష మాట్లాడేవాళ్ల సంఖ్య పడిపోయిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్ మరింత దారుణానికి తెగించింది. తెలుగులో మాట్లాడితే పనిష్మెంట్ తప్పదు అని బోర్డు పెట్టింది. ఈ విషయాన్ని ఓ ఐపీఎస్ అధికారి ట్వీట్ చేశారు.
ఇది చూస్తే , మన తెలుగును ఐసీయు లో పెట్టి చావును పరిచయం చేస్తున్నట్లుగా లేదూ ? ఏ సంస్కృతి వారైనా, కథలో, కళలో, కాజానో, కలంకారో, మాకు మాత్రమే ప్రత్యేకమని చాటుకుంటారు. మన బెంట్ అఫ్ మైండు లో భాష బెండు కాస్త ఎక్కువే నేమో. మాటల మాంత్రికుడన్నట్టు, శత్రువులెక్కడో ఉండరు…@Trivikramwriter pic.twitter.com/RgBKzFAnlV
— Ramesh Masthipuram (@rameshmasthi) February 22, 2023
తెలుగులో మాట్లాడితే శిక్షిస్తామని బోర్డు
తెలుగు భాషను కాపాడుకుందాం అని తెలుగు భాషా ప్రేమికులు పోరాటాలు చేస్తున్నారు. అయినప్పటికీ తెలుగులో మాట్లాడితే శిక్షిస్తాం అనే వాళ్లు కొన్ని స్కూళ్లలో లేకపోలేదు. బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఇలా ఓ స్కూల్ పెట్టిన బోర్డు వివాదాస్పదం అయింది. స్కూల్ లో తెలుగు మాట్లాడితే శిక్షిస్తాం అని బోర్డు పెట్టారు. ఈ బోర్డు చూసిన ఓ ఐపీఎస్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తెలుగు భాషపై తన అభిమానాన్ని చాటుకున్న ఆ అధికారి, బోర్డు పెట్టిన వారికి చురకలంటించారు. ఈ బోర్డులో TELUGU స్పెల్లింగ్ కూడా TELGU అని తప్పుగా రాశారు. తెలుగు వద్దంటున్న వాళ్ల ఇంగ్లిష్ పాండిత్యం ఇలా ఉందని సెటైర్లు వేశారు.
ఐపీఎస్ అధికారి ట్వీట్
ఐపీఎస్ అధికారి ట్వీట్ చేస్తూ... "ఇది చూస్తే , మన తెలుగును ఐసీయూలో పెట్టి చావును పరిచయం చేస్తున్నట్లుగా లేదూ? ఏ సంస్కృతి వారైనా, కథలో, కళలో, కాజానో, కలంకారో, మాకు మాత్రమే ప్రత్యేకమని చాటుకుంటారు. మన బెంట్ ఆఫ్ మైండులో భాష బెండు కాస్త ఎక్కువే నేమో. మాటల మాంత్రికుడన్నట్టు, శత్రువులెక్కడో ఉండరు" అన్నారు.
ఈ ట్వీట్ పై స్పందిస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంగ్లిష్ కూడా ఒక భాష మాత్రమే అని, అందుకోసం తెలుగు మాట్లాడవద్దని రూల్ పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.

నేను 17 సంవత్సరాల నుండి UK లో ఉంటున్నాను

నేను గర్వంగా చెప్పగలను తెలుగును మించిన భాష లేదని 😊😊

ఇంగ్లీషులో మాట్లాడటం గొప్పా కాదూ … తెలుగు నేర్చుకోవడం తప్పూ కాదు

ఇంగ్లీష్ కూడా ఒక భాష ... అంతే
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) February 22, 2023

టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)