X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం... ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక... రంగంలోకి అత్యవసర బృందాలు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగర వాసులను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

FOLLOW US: 

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేటలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో రాత్రి 9 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. 


Also Read: ఇండస్ట్రీకి నా మీద కాన్ఫిడెన్స్ పోయింది.. దేవకట్టా కామెంట్స్!






రంగంలోకి అత్యవసర బృందాలు 


సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అంబర్‌పేటలో భారీ వర్షం కారణంగా ముసారాంబాగ్‌ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. బ్రిడ్జిపై వాహన రాకపోకలు నిలిపివేశారు. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్‌ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. 


Also Read: క్షమాపణ చెప్పిన జగ్గారెడ్డి - టీ కాంగ్రెస్‌లో సద్దుమణిగిన వివాదం






రాగల మూడు రోజులు వర్షాలు


ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 470 కి.మీ. దూరంలో తూర్పు - ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి 540 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖపట్నం, గోపాల్​పూర్ మధ్యలోని కళింగపట్నం వద్ద ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు.


Also Read: తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... ముందస్తు చర్యలకు సీఎం జగన్ ఆదేశం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండిం

Tags: telangana news heavy rains hyderabad rains Hyderabad News TS rains rains news

సంబంధిత కథనాలు

AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు, 4 మరణాలు... తెలంగాణలో 135  కేసులు

AP TS Corona Updates: ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు, 4 మరణాలు... తెలంగాణలో 135  కేసులు

Breaking News Live: పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి

Breaking News Live: పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి

Warangal Crime: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

Warangal Crime: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...

Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...

TRS Plenary: 20 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ.. 60 ఏళ్ల కలను నెరవేర్చింది..! ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

TRS Plenary: 20 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ.. 60 ఏళ్ల కలను నెరవేర్చింది..! ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు