Devakatta: ఇండస్ట్రీకి నా మీద కాన్ఫిడెన్స్ పోయింది.. దేవకట్టా కామెంట్స్!
సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం 'రిపబ్లిక్'. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరు లాంఛ్ చేశారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం 'రిపబ్లిక్'. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరు లాంఛ్ చేశారు. ఈ సినిమాను ముందుగా అనుకున్నట్టే చిత్ర యూనిట్ అక్టోబర్ 1న విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read: 'కొండపొలం' ఇంట్రెస్టింగ్ అప్డేట్.. 'రొమాంటిక్' మూవీ రిలీజ్ డేట్..
ఈ ఈవెంట్ లో దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ..''ఈ సినిమా షేప్ కి వచ్చి.. ఈ స్టేజ్ కి రావడానికి కారణం తేజ్. ఈ సినిమా లైన్ చెప్పగానే తేజ్ కి బాగా నచ్చింది. నాతోనే సినిమా చేస్తానని ప్రామిస్ చేయమని అడిగాడు. ఆ సమయంలో నా మీద ఇండస్ట్రీకి కాన్ఫిడెన్స్ పోయింది. 'ప్రస్థానం' తరువాత నేను చేసిన తప్పుల వలనో లేక వేరే కారణాల వలనో కానీ తేజ్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఓ సైనికుడిలా ఈ సినిమాను కాపాడాడు. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండాలి కానీ సినిమా సోల్ దెబ్బ తినకూడదని పోరాడాడు తేజ్. ప్రస్తుతం తేజ్ చాలా త్వరగా రికవర్ అవుతున్నాడు. ఈ సినిమా కథ చెప్పినరోజు దగ్గర నుంచి నిర్మాతలు మొత్తం పవర్ నాకే ఇచ్చారు. ఈ సినిమా నా లిబరేషన్, నా వాలిడేషన్. ఈ సినిమా సక్సెస్ కి అందరూ కారకులు. ఫెయిల్ అయితే మాత్రం నేనే కారణమవుతాను. మణిశర్మ గారు అద్భుతమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎడిటర్ మనసు పెట్టి పని చేశారు. ప్రతీ ఒక్కరూ సినిమా కోసం కష్టపడ్డారు. డైలాగ్స్ మీద చాలా మంది మీమ్స్ చేశారు. నా దృష్టిలో ప్రతి మాట ఒక ఆలోచన. ట్రైలర్ లో వినిపించిన ప్రతి డైలాగ్ నా ఆలోచన. ఆ మాటలన్నీ మీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని అనుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..
Also Read: పాటల తోటమాలి మనల్ని వదిలి నేటికి ఏడాది.. నీ పాట మిగిలే ఉంది.. మిగిలే ఉంటుంది