అన్వేషించండి

Ganesh Immersion 2024: గణేష్ నిమజ్జనం ఎఫెక్ట్ - జనసంద్రంగా హుస్సేన్ సాగర్ పరిసరాలు, 10 నిమిషాలకోసారి మెట్రో స్టేషన్‌లోకి ఎంట్రీ

Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. దీంతో మెట్రో స్టేషన్ మూసేసిన అధికారులు 10 నిమిషాలకోసారి గేట్లు తెరుస్తున్నారు.

Huge Crowd In Khairatabad Metro Station: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం అశేష భక్తజనం మధ్య కోలాహలంగా సాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh Immersion) వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వేలాది విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. విపరీతమైన రద్దీతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లను సిబ్బంది మూసేశారు. పది నిమిషాలకోసారి గేట్లు తెరిచి ప్రయాణికులను లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌తో (Khairatabad Metro Station) పాటు బస్టాప్స్ సైతం కిక్కిరిసిపోయాయి. 70 అడుగుల ఖైరతాబాద్ గణేశుని భారీ విగ్రహ నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.

అర్ధరాత్రి వరకూ మెట్రో

అటు, గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుంది. నిమజ్జనం ముగిసే వరకూ ప్రయాణికుల రద్దీ, అవసరం మేరకు అదనపు రైళ్లు నడుపుతామని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎంఎంటీఎస్ రైళ్లు సైతం అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ సర్వీసులు నడుస్తాయని చెప్పారు. హైదరాబాద్ - లింగంపల్లి, సికింద్రాబాద్ - హైదరాబాద్, లింగంపల్లి - ఫలక్‌నుమా, లింగంపల్లి - హైదరాబాద్, ఫలక్‌నుమా - సికింద్రాబాద్, హైదరాబాద్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - హైదరాబాద్ రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు సీపీ విజ్ఞప్తి

నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఉదయం వరకూ విగ్రహాలన్నీ నిమజ్జనం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తామన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. బాలాపూర్ వినాయకున్ని కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. నగరంలో దాదాపు లక్ష విగ్రహాలు ఉండొచ్చని వాటిలో 20 వేల నుంచి 30 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులు ప్రజా రవాణా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Balapur Laddu Auction 2024: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget