Balapur Laddu Auction 2024: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి
Balapur Ganesh Laddu Auction:బాలాపూర్ గణేష్ లడ్డూ అనుకునట్టుగానే కొత్త రికార్డు క్రియేట్ చేసింది. పోటీలో తక్కువ మందే ఉన్నప్పటికీ హోరాహోరీగా సాగిందీ వేలం. ఈసారి రూ.30 లక్షల వెయ్యి పలికింది.
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు సృష్టించుకొని పైపైకి వెళ్తోంది బాలాపూర్ గణేష్ లడ్డూ. ఈసారి కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే పోటాపోటీగా సాగింది వేలం.
కొత్త తీసుకొచ్చిన రూల్ ప్రకారం ముందుగా గతేడాది లడ్డూ అమ్ముడుపోయిన ధర డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. అందుకే చాలా తక్కువ మంది ఈ డబ్బులు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ వేలంలో అమ్మడుపోయింది. దీంతో ఆ 27 లక్షలు డిపాజిట్ చేసిన కొద్ది మంది మాత్రమే ఈ వేలంలో పాల్గొన్నారు.
గతేడాది ఆక్షన్‌లో పాల్గొన్న దయానందరెడ్డి కూడా ఈసారి 27 లక్షలు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. పోటీలో ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ పోటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పోటీలో ఉన్న కొద్ది మంది లడ్డూ కోసం హోరాహోరీగా తలపడ్డారు. చివరకు 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలను శంకర్‌రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు.
గతేడాది కూడా ఈయనే
ఈసారి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న దాసరి దయానంద రెడ్డి మరోసారి ఆ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది ఈ లడ్డూను 27 లక్షల రూపాయలకు ఈయన దక్కించుకున్నారు. ఇసారి కూడా 27 లక్షలు డిపాజిట్ చేసి వేలంలో పోటీ పడి మరీ భారీ ధర చెల్లించి లడ్డూను ఇంటికి తీసుకెళ్లారు. గతేడాది లడ్డూ దక్కించుకున్న తర్వాత బాగా కలిసి వచ్చిందని అందుకే ఈసారి పోటీ పడి మరీ సొంత చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇప్పటివరకు లడ్డూ దక్కించుకున్న వ్యక్తులు
సంవత్సరం | దక్కించుకున్న భక్తులు | వేలంలో లడ్డూ ధర |
1994 | కొలను మోహన్ రెడ్డి | రూ. 450 |
1995 | కొలనుమోహాన్ రెడ్డి | రూ.4500 |
1996 | కొలను కృష్ణారెడ్డి | రూ.18 వేలు |
1997 | కొలను కృష్ణారెడ్డి | రూ.28వేలు |
1998 | కొలను మోహన్ రెడ్డి | రూ. 51వేలు |
1998 | కళ్లెం ప్రతాప్ రెడ్డి | రూ.65వేలు |
1999 | కళ్లెం అంజిరెడ్డి | రూ.66వేలు |
2000 | జి. రఘునందన్ చారి | రూ.85వేలు |
2001 | కందాడ మాధవరెడ్డి | రూ.1.05లక్షలు |
2002 | చిగురంత తిరుపతిరెడ్డి | రూ.1.55లక్షలు |
2003 | కొలను మోహన్ రెడ్డి | రూ.2.01లక్షలు |
2004 | ఇబ్రహీం శేఖర్ | రూ.2.08లక్షలు |
2005 | చిగురంత తిరుపతి రెడ్డి | రూ.3 లక్షలు |
2006 | జి.రఘునందన్ చారి | రూ.4.15లక్షలు |
2007 | కొలను మోహన్ రెడ్డి | రూ. 5.07 లక్షలు |
2008 | సరిత | రూ.5.10లక్షలు |
2009 | కొడలి శ్రీధర్ బాబు | రూ. 5.35లక్షలు |
2010 | కొలను బ్రదర్స్ | రూ. 5.45లక్షలు |
2011 | పన్నాల గోవర్థన్ | రూ. 7.50లక్షలు |
2012 | తీగల కృష్ణారెడ్డి | రూ.9.26లక్షలు |
2013 | సింగిరెడ్డి జైహింద్ రెడ్డి | రూ. 9.50లక్షలు |
2014 | కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి | రూ. 10.32 లక్షలు |
2015 | స్కైలాబ్ రెడ్డి | రూ. 14.65లక్షలు |
2016 | నాగం తిరుపతి రెడ్డి | రూ.15.60 లక్షలు |
2017 | నాగం తిరుపతి రెడ్డి | రూ. 15 లక్షల 60 వేలు |
2018 | శ్రీనివాస్ గుప్తా | రూ. 16 లక్షల 60 వేలు |
2019 | కొలను రాంరెడ్డి | రూ.17.60 లక్షలు |
2021 | మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్ | రూ. 18.90 లక్షలు |
2022 |
వంగేటి లక్ష్మారెడ్డి | రూ. 24 లక్షల 60 వేలు |
2023 | దాసరి దయానంద్ రెడ్డి | రూ. 27 లక్షలు |
2024 | కొలను శంకర్‌రెడ్డి | రూ. 30 లక్షల వెయ్యి |
Also Read: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర