Harish Rao : వంద రోజుల పాలనలో కాంగ్రెస్ విపలం - తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ - హరీష్ విమర్శలు
Telangana : రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన తెలంగాణ పరువు తీసిందని హరీష్ రావు విమర్శించారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమయిందన్నారు.
Harish On Congress : వంద రోజుల పాలనలో ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యిందని హరీష్ రావు ఆరోపించారు. మూడు విచారణలు, ఆరు వేధింపులు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగిందని.. మొదటి సంతకం రుణమాఫీ అని మాట తప్పారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుర్చీ ఎక్కడం మాత్రం రెండు రోజుల ముందు జరుపుకున్నారు కానీ గ్యారంటీలకు మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత తెస్తామని మాట తప్పారన్నారు. ప్రగతి భవన్ ను కూల్చుతాం నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు అందులో ఉంటున్నారని గుర్తుచేశారు. అసెంబ్లీ స్వరూపాన్ని మార్చేస్తా అన్నారు. ఇప్పటివరకు తట్టడం మట్టి కూడా తవ్వలేదన్నారు.
రైతు భరోసా అన్నారు. మేమిచ్చే రైతు బందును ఇప్పటివరకు పూర్తి చేయలేదు. రుణమాఫీ పై అతిగతి లేదు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు ఉన్న పింఛన్లు సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం కేసీఆర్ చేస్తే, రేవంత్ రెడ్డి గారు కరువు పెంచేందుకు పోటీపడుతున్నారని విమర్శఇంచారు. దేశమంతా కరువు ఉందని మాటలు చెబుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని.. కెసిఆర్ పాలనలో పచ్చడి పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. కెసిఆర్ వ్యవసాయాన్ని శిఖరాగ్రం లో నిలబెడితే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థకు చేర్చుకున్నారు. కెసిఆర్ హయాంలో తాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే, రేవంత్ రెడ్డి పాలనలో కన్నీళ్ళకు కొరత లేని పరిస్థితి వచ్చిందని ఆవేన వ్యక్తం చేశారు.
ఖమ్మం పట్టణంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నల్ల వస్తున్నదని చెబుతున్నారని కర్ణాటక నుండి తాగునీరు తేవడంలో పూర్తిగా వైఫల్యం పొందారని హరీష్ విమర్శఇంచారు. వంద రోజుల్లో గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తామని మాట చెప్పారు. ఒక్కరికి ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కెసిఆర్ అనారోగ్యంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని..పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయిందని మొన్నటి బడేబాయ్ వ్యాఖ్యలతో అర్థమైందన్నారు. బడే బాయ్ చోటే బాయ్ బంధం బయట పడిందని.. దేశంలో బద్ద విరోధులమని చెబుతారు తెలంగాణలో మాత్రం బలమైన బంధంగా ఉంటారని సెటైర్ వేశారు.
పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు బిజెపి నాయకుల ఇంట్లోకి వెళ్తున్నాడు.ఫార్మాసిటీ రద్దు అన్నారు. మాట మార్చారు. మెట్రో రైలు వద్దు అన్నారు. మాట మార్చారు.
అనేక విషయాల్లో యూ టర్న్ తీసుకున్నారు. యూటర్న్ యూట్యూబ్ పాలని కనిపిస్తున్నదని హరీష్ ఆరోపించారు. గేట్లెత్తితే మీ పార్టీలో ఒక్కరు మిగలడని రేవంత్ రెడ్డి అంటాడు పార్టీల గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పంటలకు నీళ్లు ఇవ్వండి.పొలాలకు నీళ్లు ఇచ్చి పంటలు కాపాడే ప్రయత్నం చేయండని సలహా ఇచ్చారు. వందరోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చెందారన్నారు.
కౌలు రైతులకు ఎకరానికి 15000 అన్నారు వ్యవసాయకులకు 12,000 అన్నారు వరి పంటకు 500 బోనస్ అన్నారు. ఇవన్నీ మోసం దగా అన్యాయమని విమర్శించార. రేపు నోటిఫికేషన్ అంటున్నారు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే వాటిని అమలు చేయాలని సవాల్ చేశారు. ముళ్ళ కంచెలు, నిర్బంధాలు, అరెస్టులు పెరిగినాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం అయిపోలేలపై వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. వర్షపాతం సరిగా లేనందున పంటలు ఎండిపోతున్నాయని ద వైర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం అన్నాడు. 14 శాతం వర్షపాతం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ ఏమో స్పష్టం చేసిందన్నారు.
ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. మూడు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 7500 కోట్లు మహిళలకు బాకీ పడింది. ఏం మొహం పెట్టుకొని మహిళా సదస్సు నిర్వహిస్తారని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తా అన్నారు. లక్ష పైగా పెళ్లిళ్లు జరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జరిగిన పెళ్లిళ్లకు మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సిందేనన్నారు. అనవసరానికి పోతే ఉన్నవస్త్రం పోయిందన్నట్టుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నది. మా నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తున్నది. కాంగ్రెస్ హస్తం.. బస్మాసురా హస్తంగా మారిందన్నారు. మెడ మీద కత్తి పెట్టి నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నాం అని అనుకుంటున్నారు కావచ్చు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మండిపడ్డారు.