(Source: Poll of Polls)
Huzurabad Harish : హుజురాబాద్‌లో హరీష్ గ్యాస్ బండ గుర్తుకు ప్రచారం చేస్తున్నారా..? ట్రబుల్ షూటర్‌కు కొత్త సమస్య !
హుజురాబాద్‌లో హరీష్ రావు గ్యాస్ బండ గుర్తు వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారంటూ ఈటల వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా హరీష్ గ్యాస్ బండతో కనిపిస్తున్నారు మరి !
హుజురుబాద్ ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు తన వ్యూహాల అమలులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనకు గ్యాస్ సిలిండర్ సమస్య వచ్చి పడింది. టీఆర్ఎస్‌ను గెలిపించేందుకు హరీష్ రావు బీజేపీ ప్రజా వ్యతిరేకత విధాలను హరీష్ ఎక్కువ హైలెట్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా గ్యాస్ సిలిండర్ రేట్ల పెంపు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
Also Read : డబ్బులు ఇచ్చేదాకా కొట్లాడతా.. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
గ్యాస్ ధర సామాన్యులకు భారంగా మారింది. సిలిండర్ ధర రూ. వెయ్యికు చేరువ అయింది. కానీ సబ్సిడీ మాత్రం రూ. 30 కూడా ఇవ్వడం లేదు. ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఈ విషయంలో తమ అసహనాన్ని దాచుకోరు. ఆ ఆగ్రహం మొత్తాన్ని ఈటల వైపు మళ్లించగలిగితే తన పని సులువు అవుతుందని హరీష్ రావు గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రజల్లో ఈటలపై వ్యతిరేకత పెంచాలంటే గ్యాస్ రేట్లను హైలెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈటల పోటీ చేస్తోంది బీజేపీ తరపున కాబట్టి.. గ్యాస్ బండ ధరలను పెంచుతోంది బీజేపీ కాబట్టి గ్యాస్ బండ ప్రచారాన్ని హైలెట్ చేస్తున్నారు.
ఇండిపెండెంట్ అభ్యర్థి కుమ్మరి ప్రవీణ్ గారి
— Share Telangana (@ShareTelangana) October 21, 2021
(గుర్తు గ్యాస్ సిలిండర్) తరుపున ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న తెరాస అభ్యర్ధి గెళ్లు శీను అన్న మరియు మంత్రి హరిశ్ రావు గారు🤣🔥 #HuzurabadByPoll #huzurabadbyelection pic.twitter.com/AfxVhhBDal
Also Read : మోహన్‌బాబు అరెస్ట్‌కు రెండు రాష్ట్రాల్లో ఫిర్యాదులు ! ఎందుకంటే ?
హరీష్ రావు ఎక్కడకు వెళ్లినా గ్యాస్ బండను తీసుకెళ్తున్నారు. సభల్లో దాన్నే ప్రదర్శిస్తున్నారు. వాహనంలోనూ ఓ గ్యాస్ బండ ఉండేలా చూసుకుంటున్నారు. ఇది కొంత వరకు సత్ఫలితాలను ఇస్తోందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే హరీష్ వ్యూహానికి ఈటల వర్గీయులు ప్రతి వ్యూహం అమలు చేస్తున్నారు. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్యాస్ సిలిండర్ గుర్తు వచ్చింది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున హరీష్ ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఈటల వర్గీయులు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారం విస్తృతంగా జరుగుతూండటంతో టీఆర్ఎస్ వర్గాలకు ఇబ్బందికరంగా మారింది.
Also Read : ఎంతటివారైనా ఉపేక్షించవద్దు.. డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్: సీఎం కేసీఆర్
ఇప్పటికే ఈటల రాజేందర్ కూడా భారతీయ జనతా పార్టీ గురించి పెద్దగా ప్రచారం చేయడం లేదు. అభ్యర్థి ఈటల రాజేందర్.. గుర్తు బీజేపీ అన్న పద్దతిలోనే ప్రచారం సాగుతోంది. అందుకే ఇటీవల కేటీఆర్ కూడా బీజేపీ, కేటీఆర్ ఇద్దరు ఎవర్నీ ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ.. హుజురాబాద్‌లో కౌంటర్, ప్రతి కౌంటర్ రాజకీయాలు జోరందుకుంటున్నాయి.
Also Read: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి