Drugs In Telagnana: ఎంతటివారైనా ఉపేక్షించవద్దు.. డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్: సీఎం కేసీఆర్
తెలంగాణాలో గంజాయి అక్రమ సాగు, గంజాయి అక్రమ రవాణా, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనకరంగా మారుతున్న సమస్య గంజాయి అక్రమ సాగు, గంజాయి అక్రమ రవాణా. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, సరఫరా, వినయోగంపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో బుధవారం నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. గంజాయి వినియోగం పెరుగుతోందని రిపోర్టులు వస్తున్నాయని, కచ్చితంగా దీనిపై యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణాలో గంజాయి అక్రమ సాగు, వినియోగం తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని, గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. కొత్త రాష్ట్రమైనా అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధితో కోటి 30 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయంలో పంజాబ్ ను సైతం తెలంగాణ మించిపోతున్నది. మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాలలోని మారుమూల గ్రామాలకు సైతం తాము చెప్పినట్లుగా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నాం.
Also Read: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
పలు రంగాల్లో తెలంగాణ విజయాలు..
పలు రంగాల్లో తెలంగాణ విజయం సాధించింది. ఉద్యమ సమయంలో కోరుకున్న అంశాలను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నాం. విద్యుత్ రంగంలో అపూర్వ విజయం సాధించాం. పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ అత్యుత్తమ ప్రతిభ, నైపుణ్యం కనబరచడం వల్లే పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయని’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు
ఒకవైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సమయంలో గంజాయి వంటి మాదకద్రవ్యాల సాగు, వినియోగం పెరగడం శోచనీయం. ఈ సమస్యను తొలగించుకోవాలంటే గంజాయి సాగు, వినియోగం, స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలి. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని పోలీస్, ఎక్సైజ్ శాఖ తీవ్రంగా పరిగణించాలి. యువత సైతం గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మెసెజ్ లు అందజేసుకుని డ్రగ్స్ తీసుకుంటున్నారని పలు నివేదికలు వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగంతో యువత మానసిక స్థితి దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
Also Read: నాతో రండి.. సమస్యల్లేకపోతే ముక్కు నేలకు రాస్తా, ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించే మగాడే లేడు: షర్మిల
డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్
తెలంగాణలో గంజాయి అక్రమ సాగు, వినియోగాన్ని అంతం చేసేందుకు డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి, ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రడ్స్ మాఫియాను అణిచివేయాలని, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించవలసిన అవసరం లేదన్నారు. ఎన్ ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. వాహనాల తనిఖీ మరింత ముమ్మరం చేయాలన్నారు.