YS Sharmila: నాతో రండి.. సమస్యల్లేకపోతే ముక్కు నేలకు రాస్తా, ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించే మగాడే లేడు: షర్మిల
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
కళ్ల ముందు లక్షా 90 వేల ఉద్యోగాలు కనపడుతుంటే నోటిఫికేషన్లు ఇచ్చిన పాపాన పోవడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. తెలంగాణలో ఎలాంటి పరిణామాలకు కనీసం స్పందన లేదని మండిపడ్డారు. ఆడబిడ్డలు జైళ్లలో చచ్చిపోతే కనీస స్పందన కరువైందని, లాయర్లు నడిరోడ్డుపై హత్యకు గురైతే కనీసం నోరు విప్పేందుకు కూడా కేసీఆర్‌కు తీరిక లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో నిజంగా సమస్యలు లేకపోతే తన ముక్కు నేలకు రాసి పాదయాత్ర నుంచి ఇంటికి వెళ్లిపోతానని షర్మిల వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనతో పాటు పాదయాత్రకు రావాలని సవాలు విసిరారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలోనూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లను, టీచర్లను భర్తీ చేయించాలనే డిమాండ్ మాత్రమే కాకుండా.. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకే ఈ ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగుతుంది. ‘కేసీఆర్ లాంటి పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట.. రూ.33 వేల కోట్ల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.1.30 లక్షల కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. రూ.వేల కోట్ల కమిషన్ల కోసం ప్రాజెక్టుల అంచనాలను పెంచేసి అక్రమంగా తెలంగాణ సంపదను నీటిపాలు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతిని నిలదీయడం కోసమే ఈ ప్రజా ప్రస్థాన యాత్ర సాగుతుంది.
మాటలు చెప్పే మొనగాళ్లే గానీ, పూటకు భత్యమిచ్చే పుణ్యాత్ములు కాదు: షర్మిల
‘‘దళితులను అన్ని రకాలుగా కేసీఆర్ మోసం చేశాడు. దళిత సీఎం, దళిత ఉప ముఖ్యమంత్రి అన్నాడు. దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు. కానీ, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పుడేమో అసెంబ్లీ సాక్షిగా మూడు ఎకరాల భూమి హామీపై తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. 2014 మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించాడు. ఇప్పుడు అసెంబ్లీలో దళితులకు మూడు ఎకరాల భూమి ఉంటే బావుండని చెప్పామని సమర్థించుకున్నాడు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 800 శాతం అధికంగా దాడులు పెరిగాయి. దళితుల గౌరవం కోసం కేసీఆర్ అహంకారాన్ని దింపడం కోసమే ఈ ప్రజా ప్రస్థాన యాత్ర చేస్తున్నా. అయ్యా కొడుకులు.. మీరు మాటలు చెప్పే మొనగాళ్లే గానీ, పూటకు భత్యమిచ్చే పుణ్యాత్ములు మాత్రం కాదు. వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం వారిపై దయలేదు.
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
కేసీఆర్‌ను ప్రశ్నించే మొగాడే లేడు: షర్మిల
మాటపై నిలబడే నాయకులు.. మాట నిలబెట్టుకొనే నాయకులు కావాలని యువత కోరుకుంటున్నారు. అలా మాట నిలబెట్టుకున్న నాయకుడు ఒక్క వైఎస్ఆర్ మాత్రమే. ఆయన బిడ్డగా.. ఆయన వారసురాలిగా వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజకీయాలకు సరికొత్త వేదిక కానుంది. ఈ పార్టీలోకి యువతను ఆహ్వానించేందుకు ఈ ప్రజా ప్రస్థాన యాత్ర సాగుతుంది. ప్రశ్నించే వాడు లేకపోతే పాలించేవాడు మొత్తం దోచుకుంటాడు. ఈ ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించేవాడే మొగాడే లేడు కాబట్టి.. ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అయింది. ఇప్పుడు మేం వచ్చాం.’’ అని వైఎస్ షర్మిల ప్రసంగించారు.
Also Read: Gold Smuggling: బ్యాటరీలలో 2.9 కోట్ల బంగారం.. అలా చేశారు.. ఇలా దొరికిపోయారు
Also Read: Bandi Sanjay: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి