Telangana University: తెలంగాణ యూనివర్సిటీ పేరుతో నకిలీ పట్టాల కలకలం
తెలంగాణ యూనివర్సిటీ పేరుతో డిగ్రీ, పీజీ నకిలీ ధ్రువపత్రాలను అమ్ముకుంటున్న బాగోతం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ పేరు మీద ధ్రువపత్రాలు ముద్రించిన వైనం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ లో నకిలీ డిగ్రీ, పీజీ పట్టాలు దొరికాయి. హైదరాబాద్ లోని ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు ఈ నకిలీ పట్టాలను తయారు చేస్తున్నట్లు సిటీ టాస్క్ ఫోర్స్ గుర్తించింది. ఈ మేరకు అక్కడి టాస్క్ ఫోర్స్ సిబ్బంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. యూనివర్సిటీ అధికారులను విచారించారు. విచారణలో అవి నకిలీ పత్రాలు అని తేలింది. ముద్రించిన పట్టాలు యూనివర్సిటీవి కావని వర్సిటీ అధికారులు.. పోలీసులకు స్పష్టం చేశారు. అచ్చం వర్సిటీ జారీచేసే ఒరిజినల్ పట్టాల మాదిరిగానే ఉన్నా అవి నకిలీ పట్టాలు అని యూనివర్సిటీ అధికారులు నిర్ధారించారు. టీయూ పేరుతో నకిలీ పట్టాలు వెలుగు చూడటం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాలలో నకిలీ ముఠాలు పట్టుబడ్డాయి.
నకిలీ పట్టాల తయారీ, జారీ వెనక ఎవరెవరు ఉన్నారు. ఎన్ని పత్రాలు జారీ చేశారు. అసలు పాత్రధారులు ఎవరు, వీటిని ఎంతకు అమ్మారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు డిచ్ పల్లి పోలీసులు. యూనివర్సిటీ సిబ్బందిలో ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవలే విదేశీ విద్యా నిధిలో గోల్ మాల్
పేద విద్యార్థుల విదేశీ విద్య కలలను సాకారం చేసేందుకు.. ప్రభుత్వం అమలు చేస్తున్న విదేశీ విద్యా నిధిని కొందరు అక్రమార్కులు తప్పుదారి పట్టించారు. దళారులు, అధికారులు, విద్యార్థులు కుమ్మక్కై... అడ్డదారుల్లో నిధిని కాజేసేందుకు కుట్రలు చేసినట్టు కొన్ని రోజుల క్రితం తేట తెల్లమైంది. నకిలీ ఇంజినీరింగ్ విద్యార్హత ధ్రువపత్రాలను... ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నట్లు వెలుగు చూసింది.
పేద విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి, బీసీలకు జ్యోతిబాపూలే, మైనారిటీలకు సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాలు ఉన్నాయి. ఇంజినీరింగ్‌లో మార్కులు, టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్ స్కోరు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో... ఉత్తీర్ణులై ఉండాలి. బీటెక్ మార్కులకు 60శాతం వెయిటేజి, జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్కు 40శాతం వెయిటేజి ఉంటుంది. కొంతమంది విద్యార్థులు బీటెక్ మార్కులను పెంచి ఫోటోషాప్ ద్వారా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం తెలిసింది.
Also Read: Pushpa Movie: 'పుష్ప'కు కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నది పెద్ద సాయమే...
Also Read: Inter Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల... రిజెల్ట్స్ కోసం ఇలా చెక్ చేసుకోండి
Also Read: Hyderabad Containment Zone: హైదరాబాద్‌లో మళ్లీ కంటైన్మెంట్ జోన్.. ఈ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి