X

Etela Rajendar: కేసీఆర్ రైతుబంధు కాదు.. రైతు ద్వేషి.. అదంతా ఆయన నిర్వాకమే

యుద్ధం కాదు.. కేసీఆర్‌ పతనం ఆరంభమైందని ఈటల రాజేందర్ విమర్శించారు. రైతులు ఏడుస్తుంటే.. నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం తన బాధ్యతను మరిచిపోతుందని ఆరోపించారు. 

FOLLOW US: 

కన్నీళ్లు పెడుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్‌ ప్రభుత్వం బాధ్యతను విస్మరిస్తోందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఈటల అన్నారు. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం రంగు మారుతోందన్నారు.  వర్షాలకు తడిసి మొలక వస్తోందని చెప్పారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని ఈటల అన్నారు. 

అన్నీ నాకే తెలుసు.. అన్నీ చేయగలననే అహంకార ధోరణితో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. కేసీఆర్‌ నిర్వాకం వల్ల తెలంగాణ రైతులు.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని ఈటల స్పష్టం చేశారు. ఒకప్పుడు విపక్షాలతో చర్చించి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాలు ఉండేవని.. రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ దేశంలో ఏరాష్ట్రం కూడా కొనలేని వరి ధన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని అసెంబ్లీలో సీఎం గొప్పలు చెప్పారన్న ఈటల..  ఆ సమయంలో కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, సహకరిస్తుందని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్‌ కాదని,  ధాన్యం, గన్నీ బ్యాగ్‌లు, హమాలీ ఛార్జీలు, ఐకేపీ కేంద్రాల కమీషన్‌, రైసు మిల్లుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని స్పష్టమైంది. కేసీఆర్‌ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదు. ఒకసారి వరి వేయొద్దన్నారు, ఒకసారి పత్తి వేయొద్దన్నారు, ఒకసారి సన్న వడ్లు వేయొద్దన్నారు. ఇష్టమొచ్చినట్టు కేసీఆర్‌ చెబుతున్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనటాన్ని కేంద్రం ఎప్పుడైనా నిలిపివేస్తుందని గతంలో మిల్లర్లు  ముఖ్యమంత్రికి చెప్పారు. రైతు సంఘాలు, మిల్లర్ల సూచనలు కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతున్నారు. కేసీఆర్‌ రైతు బంధు కాదు.. రైతు ద్వేషి. ఒక్క రైతు బంధు ఇచ్చి.. మిగతా ప్రయోజనాలన్నీ ఆపేశారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టలేదా? రైతుల కోసం ఆ మాత్రం చేయలేరా? హుజూరాబాద్‌ ఫలితం నుంచి ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు.
                                                                                 - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే

Also Read: TS Politics : కేంద్రం చెప్పేసింది ! ఇక రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచిస్తారా ?

Also Read: Congress: అసెంబ్లీ రౌడీ సినిమా తరహాలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు.... ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టైనా ప్రతీ గింజ కొనిపిస్తాం... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tags: etela rajendar cm kcr huzurabad Telangana BJP etela rajendar on cm kcr telangana farmers paddy problems

సంబంధిత కథనాలు

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Paddy Issue: కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన

Paddy Issue: కేంద్రం వడ్లు కొనదు... రైతులు వరి పండించొద్దు.. మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటన

Breaking News: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతల వరి దీక్ష

Breaking News: ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతల వరి దీక్ష

Petrol-Diesel Price 27 November 2021: వాహనదారులకు స్వల్ప ఊరట.. నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ పెరుగుదల!

Petrol-Diesel Price 27 November 2021: వాహనదారులకు స్వల్ప ఊరట.. నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ పెరుగుదల!

Gold Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే

Gold Silver Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

Lalu Prasad: మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

Lalu Prasad: మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స