News
News
X

Bhatti Vikramarka: ఆందోళన చెందవద్దు.. వారికి సైతం రూ.10 లక్షలు వచ్చేలా చూస్తాం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

దళిత బంధు పథకంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో అమలయ్యేలా చూస్తామన్నారు.

FOLLOW US: 

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు రూ. 10 లక్షలు వస్తున్నాయి కదా.. నాకో రూ. 10 వేలు ఇవ్వండి నేను ఇప్పిస్తాననో, లేకపోతే ఇంకో రకంగా మీకు డబ్బులు వచ్చేలా చేస్తానంటూ దళారులు, బ్రోకర్లు చాలామంది తయారవుతారని, ఎవ్వరిమాట నమ్మవద్దని సూచించారు. మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం బోన‌క‌ల్, చింతకాని మండల కేంద్రం, సీతంపేట గ్రామాల్లో ఆదివారం కాంగ్రెస్ నేత పర్యటించారు. దళిత బంధు పథకం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో అమలయ్యేలా చూస్తామన్నారు.

తమ దగ్గ‌ర ప్ర‌తి ఊరు లెక్క ఉందని.. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి.. ఎన్ని రేష‌న్ కార్డులు ఉన్నాయి.. కొత్త‌గా ఎంతమంది రేష‌న్ కార్డుకోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌న్న రికార్డులు సైతం ఉన్నాయని. రేష‌న్ కార్డు లేక‌పోయినా.. పెళ్లిళ్లు అయివుంటే వారికి సైతం ప్రత్యేకంగా ద‌ళిత‌ బంధు వ‌ర్తింప‌జేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరుగా మండలంలోని ప్రతి గ్రామానికి ఒక జిల్లా స్థాయి అధికారిని పంపిస్తారు. మీ ఇంటికే, మీ దగ్గరికే అధికారి వచ్చి.. లెక్కలు రాసుకుని, మీ పేరుమీదే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేలా చేసే  బాధ్యత కూడా తనదేనని భట్టి విక్రమార్క చెప్పారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై అవ‌గాహ‌న లేని కొంద‌రు నాయ‌కులు చేసే ప్రకటనలతో దళితులు పార్టీ మారతారనే విషయం తనకు తెలిసిందన్నారు. 

Also Read: కేటీఆర్‌కి అరుదైన ఆహ్వానం, ఈ ఛాన్స్ అందరికీ రాదట..! థ్యాంక్స్ చెప్పిన మంత్రి

తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, ఓట్ల కోసం, పార్టీ ప్రచారం కోసం అంతకన్నా రాలేదన్నారు. కేవలం దళిత ప్రజల శ్రేయస్సు కోసం రాజకీయాలకు అతీతంగా ఇక్కడకు వచ్చానన్నారు. బాగా బతకడం కోసం దళిత బంధు పథకాన్ని మీ అందరికీ వర్తించేలా, అందరికీ అందేలా చూస్తామన్నారు. ఈ దళితబంధు అమలుపై చాలా మందికి అపోహలు, అపనమ్మకాలు, రకరకాల సందేహాలు ఉన్నాయని.. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని స్పష్టం చేశారు. కేవలం టీఆర్ఎస్ పార్టీకో, కాంగ్రెస్, సీపీఎంలకు పరిమితం కాదని.. దళిత కుటుంబాలందిరికీ ఇచ్చే పథకం ఇది అన్నారు. దళిత కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.10 లక్షలు అందేలా చేయడం శాసనసభ్యుడిగా తనదే బాధ్యత అన్నారు. 

News Reels

బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేసిన తరువాత మీకు ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చునని సూచించారు. ఇందులో ఎవరి బలవంతం లేదని.. ఇతరులు చెప్పిన వ్యాపారాలు, పనులు చేయాల్సిన అవసరం లేదన్నారు. మీకు నచ్చిన వ్యాపారం, అది కూడా మీకు నచ్చిన చోట చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దళిత బంధు పథకం అమలు చేసే వరకూ ఈ గ్రామాలన్ని తిరుగుతూనే ఉంటానని.. ఎవరికైనా పథకం రాకపోతే తన దృష్టికి తీసుకువస్తే.. వారికి కూడా పథకం కింద డబ్బులు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. 

Also Read: Malla Reddy: ‘50 కోట్లతో ఆ సీటు కొన్నవ్.. దగుల్బాజీ, ఆడోళ్లు చీపుర్లు తిరగేస్తరు..’ మళ్లీ రెచ్చిపోయిన మంత్రి

తమ కుటుంబంలో ఇటీవల కుమారుడికి కొత్తగా పెళ్లయిందని, వారికి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే ఇప్పటికీ రాలేదనుకోండి. ఎలాగూ రేషన్ కార్డు లేదని ఒకే కుటుంబంగా చూస్తారని ఆందోళన అక్కర్లేదన్నారు. మీరు పెళ్లిచేసుకున్నా రేషన్ కార్డు రాకపోయినా, ప్రత్యేక కుటుంబంగానే చూసి రూ. 10 లక్షలు వచ్చేటట్లుగా చేస్తామని దళితులకు మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Published at : 19 Sep 2021 10:36 PM (IST) Tags: telangana Dalitha Bandhu Dalitha Bandhu Scheme Bhatti Vikramarka Dalit Bandhu Scheme Bhatti Vikramarka Mallu Mallu Bhatti Vikramarka

సంబంధిత కథనాలు

Gold-Silver Price 29 November 2022:  53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

KCR Early Polls : సంక్షేమంలో స్పీడ్ - అభివృద్ధిలో టాప్ గేర్ ! కేసీఆర్ పరుగులు ముందస్తు కోసమేనా ?

KCR Early Polls : సంక్షేమంలో స్పీడ్ - అభివృద్ధిలో టాప్ గేర్ !  కేసీఆర్ పరుగులు ముందస్తు కోసమేనా ?

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

FRO శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత - త్వరలోనే ఇంటి స్థలం, ఉద్యోగం

FRO శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత - త్వరలోనే ఇంటి స్థలం, ఉద్యోగం

టాప్ స్టోరీస్

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?