అన్వేషించండి

Telangana Elections 2023 : ఆరు గ్యారంటీలు కాదు అంతకు మించి - శుక్రవారమే కాంగ్రెస్ మేనిఫెస్టో !

Congress Manifesto : భారీ సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను సిద్ధం చేశారు. శుక్రవారం మల్లిఖార్జున్ ఖర్గే ఆవిష్కరించనున్నారు.

Telangana Elections 2023 Congress  Manifesto :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది. చాలా రోజుల కిందటే ఆరు గ్యారంటీల్ని ప్రకటించి..విస్తృతం గా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అదే సమయంలో వివిధ వర్గాలకు డిక్లరేషన్లు ప్రకటించింది. అన్నీ కలిపి తాజాగా మేనిఫెస్టో ప్రకటించనుంది. శుక్రవారం  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ( Mallikarjoun Kharge ) హైదరాబాద్ వస్తున్నారు. ఆయన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 

పేదల పెళ్లిళ్లకు తులం బంగారం హామీ !                     

కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పేదలకు పెళ్లిళ్లకు సాయం కింద రూ. లక్ష వరకూ నగదు ఇస్తున్నారు. ఆ నగదుతో పాటు  ఇక నుంచి తులం బంగారం ( Gold )  ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నారు.  అలాగే. చాలా కాలం నంచి ధరణని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ధరణి స్థానంలో భూభారతి అనే విధానాన్ని తెస్తామని.. ధరణిలో ఉన్న లోపాలన్నింటనీ సవరిస్తామని కాంగ్రెస్ పార్ట హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే  సిటిజన్ చార్ట్ కి చట్టబద్దత కల్పించే ఆలోచనచేస్తు్న్నారు.  

ఇక రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ                                 

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో  తామ మూడో సారి గెలిస్తే సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే హామీ ఇస్తోంది.  తెల్ల రేషన్ కార్డు ( White Ration Card ) కలిగిన వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మేనిపెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మొదట్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించుకుంద. ప్రకటనలు, సంచులు కూడా ఆర్డర్ ఇచ్చింది. కానీ సన్నబియ్యం పంపిణీ సాధ్యం కాదని తేలడంతో  సన్నబియ్యం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని అప్పటి మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఆ తర్వాత సన్నబియ్యం ప్రస్తావన వైసీపీ తీసుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో రెండు ప్రధాన పార్టీలు సన్నబియ్యం హామీ ఇస్తున్నాయి. కర్ణాటకలో  కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ బియ్యం లేకపోవడం వల్ల డబ్బుల ఇస్తోంది. 

పేదలకు మేలు చేసే పలు సంక్షేమ పథకాలు                      

అలాగే..  అమ్మ హస్తం పథకం పేరుతో 9 నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని నిర్ణయించకున్నారు. ఆర్ఎంపీలకు గుర్తింపు కార్డు,  రేషన్ డీలర్లకు గౌరవ వేతనం , వార్డు సభ్యులు గౌరవ వేతనం, ఎంబీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్ ,  ట్రాన్స్ జెండర్లకు ఆటోలు ,ప్రత్యేక సంక్షేమ పథకాలు , జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను పెట్టనున్నట్లుగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చే అవకాశం ఉంది.  బీఆర్ఎస్ పార్టీ కన్నా మెరుగైన హామీైలు ఇవ్వాలని ప్రజల్ని ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ అంటే సంక్షేమ రాజ్యమని మరోసారి నిరూపిస్తామని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget