News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Age Relaxation: ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి భారీగా పెంపు, SC, STలకు మరింతగా - KCR వరాల జల్లు

Job Mela In Telangana: పోలీసు శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా మిగిలిన ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు CM KCR వివరించారు.

FOLLOW US: 
Share:

Jobs Notification in Telangana: తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో (Jobs In Telangana) భాగంగా అర్హత వయసును (Age Relaxation) ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) బుధవారం నాటి అసెంబ్లీలో ప్రకటించారు. పోలీసు శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా మిగిలిన ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. దీని వల్ల ఓసీలకు 44 ఏళ్లు, SC, ST, BCలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ఠ పరిమితపెరుగుతుందని KCR చెప్పారు.

ఈ పోస్టుల భర్తీ (Government Jobs in Telangana) ప్రక్రియ కోసం ఏటా సుమారు 7 వేల కోట్ల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని చెప్పారు. అయినా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. యువతకు ఒక స్పష్టత ఉండేలా ఖాళీలను ముందే గుర్తించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calender) రూపొందిస్తామని చెప్పారు. ప్రతి విభాగంలో ఏర్పడే ఖాళీలను ఆయా శాఖలు సమర్పిస్తాయని అన్నారు. నోటిఫికేషన్ల జారీ కోసం ఆయా నియామక సంస్థలకు ఇస్తాయని అన్నారు. 

‘‘గ్రూపు 1 - 503, గ్రూపు 2 - 582, గ్రూపు 3 - 1370, గ్రూపు 4 - 9,168 పోస్టులకు తక్షణం నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జోనల్ పోస్టులు 18,866 ఉద్యోగాలు, మల్టీ జోనల్ పోస్టులు 13,170 పోస్టులు, విశ్వవిద్యాలయాలు, సెక్రెటేరియల్, హెచ్ఓడీ వంటి వాటిలో 8147 ఉద్యోగాలు రానున్నాయి.’’ అని కేసీఆర్ వివరించారు.

జిల్లా వారీగా ఉద్యోగాల సంఖ్య ఇదీ
* హైదరాబాద్ - 5,268
* నిజామాబాద్ - 1976
* మేడ్చల్ మల్కాజ్ గిరి - 1769
* రంగారెడ్డి - 1561
* కరీంనగర్ - 1,465
* నల్గొండ - 1,398
* కామారెడ్డి - 1,398
* ఖమ్మం - 1,340
* భద్రాద్రి - కొత్తగూడెం 1,316
* నాగర్ కర్నూల్ - 1,257

* జోనల్ స్థాయిలో - 18,866

* మల్టీ జోన్ - 13,170

* అదర్ కేటగిరి, వర్సిటీలు - 8,174

* మొత్తం పోస్టులు - 80,039 భర్తీ

గతంలో తెలంగాణపై అంతులేని వివక్ష: KCR

అంతులేని వివక్షతో తెలంగాణ ఎన్నో ఇబ్బందులు పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగిందని అన్నారు. తెలంగాణ రైతులను కూడా పూర్తిగా పాతాళంలోకి నెట్టేశారని గుర్తు చేశారు. ఎన్నో ఆకలి చావులు, నిరుద్యోగులు, రైతుల మరణాలు చూశామని వెల్లడించారు. తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలనే ఉద్దేశంతో తాను ఉద్యమానికి శ్రీకారం చుట్టానని అన్నారు. విద్యార్థులు కూడా ఎంతో మంది తెలంగాణ కోసం ఉద్యమించారని అన్నారు.

Published at : 09 Mar 2022 11:03 AM (IST) Tags: cm kcr KCR announcement in Assembly Government Jobs in Telangana Government Jobs age relaxation Jobs age relaxation in Telangana New jobs notification in telangana telangana New Jobs

ఇవి కూడా చూడండి

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

Top Headlines Today: టికెట్ వచ్చినా రాకున్నా అంతా నావాళ్లే: జగన్ - సీఎం కేసీఆర్‌కు అస్వస్థత - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: టికెట్ వచ్చినా రాకున్నా అంతా నావాళ్లే: జగన్ - సీఎం కేసీఆర్‌కు అస్వస్థత - నేటి టాప్ న్యూస్

BRS BC Leaders : బీసీ సమీకరణాలపై బీఆర్ఎస్‌లో టెన్షన్ - అదే అస్త్రం గురి పెట్టిన కాంగ్రెస్ ! రాజకీయం ఎజెండా మారుతోందా ?

BRS BC Leaders :  బీసీ సమీకరణాలపై బీఆర్ఎస్‌లో టెన్షన్ - అదే అస్త్రం గురి పెట్టిన కాంగ్రెస్ ! రాజకీయం ఎజెండా మారుతోందా ?

Weather Latest Update: 29 నాటికి మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

Weather Latest Update: 29 నాటికి మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

టాప్ స్టోరీస్

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?