అన్వేషించండి

Chikoti Jions BJP : ఎట్టకేలకు బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్ - తెర వెనుక ఏం జరిగిందంటే ?

డీకే అరుణ సమక్షంలో చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరారు. గతంలో బీజేపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

 

Chikoti Jions BJP :   కేసినో కింగ్ గా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. . డికె అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. దేశవిదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆయన  బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్ ప్రవేశాన్ని బిజెపి నాయకులలో ఒక వర్గం వ్యతిరేకించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఫలించలేదు. చివరికి డీకే అరుణ సమక్షంలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. 

హైకమాండ్ సూచనలతో   చీకోటి ప్రవీణ్‌కు బీజేపీ కండువా              

చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఓ ఒక క నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలోనే చీకోటి బీజేపీలో చేరాలనుకున్నారు. ఇందుకు బీజేపీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే పార్టీలో చేర్చుకునేందుకు నేతలు నిరాకరించారు. కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.తాజాగా చికోటి ప్రవీణ్‌కు బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యంతో చీకోటికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్రనాయకత్వానికి  హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లుగాచెబుతున్నారు.                        

చీకోటి ప్రవీణ్‌పై పలు  రకాల ఈడీ కేసులు                 

చీకోటి ప్రవీణ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈడీ ఆయనను పలుమార్లు  ప్రశ్నించింది.  బ్యాంకాక్‌లోనూ ఆయన  ఓ సారి క్యాసినో నిర్వహిస్తూ అక్కడి పోలీసులకు పట్టుపడ్డారు. ఈ అంశం సంచలనం అయింది. ఏపీలో వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటారని చెబుతూంటారు. గుడివాడలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కేసినో రాజకీయంగా తీవ్ర దుమారాన్నిరేపింది. ఈడీ కేసుల కారణంగా ఆయనను  పార్టీలో చేర్చుకుంటే సమస్యలు వస్తాయని రాష్ట్ర నాయకత్వం- భావిస్తూ వచ్చింది. అందుకే చేరికల విషయంలో వెనక్కి తగ్గలేదు.  ఎలాగైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్న చీకోటి ప్రవీణ్.. తనకు సన్నిహితులైన వారితో బీజేపీ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చి మరీ ఆ పార్టీలో చేరిపోయారు.                

ఏదో ఓ స్థానం నుంచి  పోటీ చేసే అవకాశం                   

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి పోటీ చేయడానికి అభ్యర్థుల కొరత ఉంది. చీకోటి లాంటి ఆర్థిక స్థోమత ఉన్న వారు పార్టీకి అవసరం అని.. అందుకే ఆయనను చేర్చుకున్నారని చెబుతున్నారు. పోటీకి సైతం చీకోటి ప్రవీణ్ రెడీగా ఉన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.                  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget