Chandrababu: భద్రాచలంలో చంద్రబాబు టూర్, రామయ్య దర్శనం - పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటన

Chandrababu: చంద్రబాబు భద్రాచలంలో గోదావరి కరకట్టను పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని గుర్తు చేసుకున్నారు.

FOLLOW US: 

Chandrabu in Bhadrachalam: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం భద్రాచలంలో పర్యటించారు. భద్రాద్రి రాములవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్రంలో పార్టీ పునర్‌వైభవం కోసం పని చేయాలని సూచించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపైన చర్చించారు. అంతకుముందు చంద్రబాబు భద్రాచలంలో గోదావరి కరకట్టను పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని గుర్తు చేసుకున్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉండిపోతాయని, ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చానని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన పోలవరం ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయిన వీరయ్య చంద్రబాబుని కలిశారు. విలీన గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలిపేలా వీలుంటే చొరవ తీసుకోవాలని చంద్రబాబును కోరారు. విలీన గ్రామాలైన ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెం ప్రజలు జేఏసీ నేతలు చంద్రబాబుని కలిశారు.

తాము ఏపీలో ఉండలేమని చెప్పారు. వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు తమను పట్టించుకోలేదని, ఇంకా చాలా ఇబ్బందులను వివరించారు. కాబట్టి, తమను తెలంగాణలో కలిపిందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందచేశారు. 

సెప్టెంబరులో ఖమ్మం జిల్లాలో భారీ సభ
ఖమ్మం జిల్లాలో వచ్చే సెప్టెంబర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని టీడీపీ నేతలు చంద్రబాబుని కోరారు. ఆ సభకు తప్పక హాజరవుతానన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వవైభవానికి కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు. 

రాములవారిని దర్శించుకున్న చంద్రబాబు
చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయం వద్ద చంద్రబాబుకు ఈవో ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు రామయ్యను దర్శించుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

Published at : 29 Jul 2022 01:30 PM (IST) Tags: Chandrababu Bhadrachalam Temple chandrababu news telangana TDP Chandrababu in Bhadrachalam

సంబంధిత కథనాలు

TS Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, నేడు, రేపు అతిభారీ వర్షాలు!

TS Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, నేడు, రేపు అతిభారీ వర్షాలు!

Breaking News Live Telugu Updates: కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం 

Breaking News Live Telugu Updates: కామన్ వెల్త్ గేమ్స్ బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కు స్వర్ణం 

TS SI Preliminary Exam 2022: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష, 91.32 శాతం మంది హాజరు!

TS SI Preliminary Exam 2022: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష, 91.32 శాతం మంది హాజరు!

Minister Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుంది, మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

Minister Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుంది, మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్

Dasoju Shravan: బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు!

Dasoju Shravan: బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు!

టాప్ స్టోరీస్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది