అన్వేషించండి

BRS Lok Sabha Review : లోక్‌సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్ష - అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం !

KTR : అత్యధిక లోక్ సభ సీట్లను గెల్చుకునేందుకు బీఆర్ఎస్ సమీక్షలు ప్రారంభించనుంది. కేటీఆర్ నేతృత్వంలోని సీనియర్ నేతల సమీక్షల్లో పాల్గొననున్నారు.

BRS Lok Sabha Review from January 3 :  అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు,  మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ఇతర సీనియర్ నేతల సమక్షంలో ఈ రివ్యూలు జరగనున్నాయి. కేసీఆర్‌కు తుంటి ఆపరేషన్ జరగడంతో ఇంకా కోలుకోలేదు. అందుకే కేటీఆర్ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి. 

రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ కారణంగా మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.జనవరి 3న ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంతో సన్నాక సమావేశాలు షురూ అవుతాయి. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి సమావేశాలు జరుగుతాయి. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ , 17న నాగర్ కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్ , 20న మల్కాజ్‌గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. 

సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా కీలక నేతలు సమావేశాలకు హాజరవనున్నారు.

తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ , కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుందని..  మంచి విజయం సాధిస్తే..  బలంగా పోరాడవచ్చని  భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Gutha Sukhender Reddy: కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
కుల గణన చారిత్రాత్మకం- ఓటర్ల జనాభాకు, సర్వే లెక్కలకు అసలు పొంతన లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
SSMB 29: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది హైదరాబాద్ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Romantic Destinations : రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
రొమాంటిక్ డెస్టినేషన్స్.. మీ ప్రేయసితో కలిసి వెళ్లేందుకు ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే
Viral Video: ఇదేందయ్యా ఇది.. మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్ 
ఇదేందయ్యా ఇది.. ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేసిన కోచ్.. నెటిజన్ల ట్రోల్ 
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Embed widget