News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana News : బీఆర్ఎస్‌కు మరో షాక్ - కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్సీ !

కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈయన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వారు.

FOLLOW US: 
Share:

Telangana News :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు త్వరలో పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో బీఆర్ఎస్ నుంచి  మరో ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నాగర్‌ కర్నూలుకు చెందిన భారత రాష్ట్ర సమితి   సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి పార్టీకి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించారు.  కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు అయన రంగం సిద్ధం చేసుకున్నారు.                                                                        

భారత రాష్ట్ర సమితి తరపున  నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉన్నారు. ఆయనతో సరిపడకపోవడంతో  పార్టీ మారాలని నిర్ణయించారు. పార్టీ హైకమాండ్ కూడా మర్రి జనార్ధన్ రెడ్డికే ప్రాధాన్యం ఇస్తున్నారు.  ఇరువురు మద్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరడం  అధినాయకత్వం పట్టించుకోకపోవడంతో కలత చెందిన దామోదర్‌ రెడ్డి పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అయన సన్నిహితులు చెబుతున్నారు.                              

అయితే దామాదర్‌ రెడ్డి చేరిక పట్ల సీనియర్‌ నేత కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు  ఆయనను ఒప్పించే బాధ్యతను పార్టీ అగ్ర నేత జానారెడ్డికి అప్పగించినట్లు సమాచారం. గతంలో జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు జరపనున్నట్లుగా తెలు్సతోంది.  నాగంకు నచ్చజెప్పి దామోదర్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకునేందుకు లైన్‌ క్లియర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అనుకున్నట్లుగా జరిగితే మే మొదటి వారంలో ఇక్కడి సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగే భారీ బహరంగ సభలో దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు.                                          

నాగర్‌ కర్నూలు నియోజక వర్గం లోని తాడూరు మండలానికి చెందిన దామోదర్‌ రెడ్డి  బీఆర్ఎస్‌లో  చేరక ముందు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల తరపున శాసనమండలికి ఎంపికై ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.  తెలుగుదేశం పార్టీ తరపున నాగం జనార్ధన్ రెడ్డి కీలకంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో ఆయనకు ప్రత్యర్థిగా దామోదర్ రెడ్డి ఉండేవారు. ఈ కారణంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేరికను నాగం స్వాగతిస్తే.. సమస్య పరిష్కారమైనట్లే. లేకపోతే  ఆయన పార్టీ మార్పు వల్ల బీఆర్ఎస్ పార్టీలో తగ్గిపోయే వర్గపోరు..  కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. 

Published at : 21 Apr 2023 07:31 PM (IST) Tags: CONGRESS Telangana Politics BRS Politics Kuchukulla Damodar Reddy

ఇవి కూడా చూడండి

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Ganesh Nimajjanam 2023: ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం, గణేష్ మండప నిర్వహకుల ఆందోళన! భారీగా ట్రాఫిక్ జామ్

Kishan Reddy: కేసీఆర్‌కి వత్తాసు పలికితే మంచోళ్లు లేదంటే చెడ్డోళ్లా, గవర్నర్‌ నిర్ణయం కరెక్టే - కిషన్‌రెడ్డి

Kishan Reddy: కేసీఆర్‌కి వత్తాసు పలికితే మంచోళ్లు లేదంటే చెడ్డోళ్లా, గవర్నర్‌ నిర్ణయం కరెక్టే - కిషన్‌రెడ్డి

KTR: మా వాదన వినిపించుకపోతే ప్రజా ఉద్యమం గ్యారంటీ - కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

KTR: మా వాదన వినిపించుకపోతే ప్రజా ఉద్యమం గ్యారంటీ - కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక

టాప్ స్టోరీస్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత