అన్వేషించండి

BRS News: మహిళలను సీఎం అవమానించారు, క్షమాపణ చెప్పాల్సిందే - బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు

Telangana News:అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

BRS MLA's : బడ్జెట్ పై కేటీఆర్ నిజాలు మాట్లాడుతుంటే.. దానిని డైవర్ట్ చేసేందుకనే సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​లోకి రమ్మనడమే నేను చేసిన తప్పా? అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి ,సునీత లక్ష్మా రెడ్డి ,ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటినుంచి ప్రజా పాలన ,ఇందిరమ్మ పాలన అని ఊదర గొడుతున్నారని ఆరోపించారు.  మహిళలకు ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చాయి. మహిళలు రాష్ట్రంలో భయం తో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల పై అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో నేను ప్రస్తావిస్తుంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీ లో నిలబడితే సీఎం అధికార పక్షం వాళ్లు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు. నాడు వైఎస్ ,చంద్రబాబు ,కేసీఆర్ లను సీఎం లుగా చూశాము. వాళ్ళు మహిళలు ఇన్ని గంటలు నిలబడితే స్పందించేవారు. ఎస్సీ వర్గీకరణ పై కోవా లక్ష్మి మాట్లాడాలి అనుకుంటే ఆమె కు కూడా మైక్ ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదన్నారు. గతం లో ఇలా ఎపుడూ లేదు. స్పీకర్ కూడా మా వినతి ని పట్టించుకోలేదు. అంబెడ్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా చెప్పారు. కనీసం దాన్ని పాటించలేదన్నారు. మా పేరు తీసుకున్నపుడు మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. భట్టి సీఎం పదవి కోసం కొట్లాడాల్సింది పొయి సీఎల్పి పదవి మా వల్ల పోయింది అంటూ ఆరోపిస్తున్నారు. 
 
ఎంత మంది పార్టీలు మారలేదు 
అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారు. ఈ రోజు కూడా సీఎం రేవంత్ మమ్మల్ని మళ్ళీ నిందించారు. సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరు ను సీఎం తీసుకోవడం ఎంత వరకు కరెక్టు అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవి కున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిదని హితవు పలికారు. రాహుల్ గాంధీ రేవంత్ ను నమ్ముకున్నారు ..ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా ?.. సభలో పురుష ఎమ్మెల్యేలు నిలబడితే అధికార పక్షం తీరు ఇలానే ఉంటుందా ?.. మహిళల పై అత్యాచారాల గురించి రేపు సభ లో లేవనెత్తుతాం .మాకు రేపు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి.. మహిళల పై జరుగుతున్న ఆఘాయిత్యాల పై ప్రభుత్వం సమాధానం గురించి పట్టు బడతామని ప్రకటించారు.  ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు సబితా ఇంద్రారెడ్డి. మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి బీ ఆర్ ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు సబితా ఇంద్రారెడ్డి.  మా ఎమ్మెల్యేలను పొలిసు వాహనాల్లో తెలంగాణ భవన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. చేవెళ్ల చెల్లెమ్మా అని నన్ను వైఎస్ పిలిచారు .కాంగ్రెస్ కాదని సబితమ్మ వాపోయారు.

అవమానం బాధాకరం

ఈ రోజు మాకు శాసన సభ లో జరిగిన అవమానం బాధాకరమని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. నాలుగున్నర గంటలు సభ లో మేము నిల్చున్నా పాలక పక్షం స్పందించక పోగా హేళన చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  అసెంబ్లీలో జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయన్నారు. మహిళల పై అత్యాచారాలు పెరిపోయాయి ..శాంతి భద్రతలు దిగజారాయని తెలిపారు.  నా ప్రచారానికి వస్తే కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల నా మీదనే మూడు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్ సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మా మీద సీఎం రేవంత్ ఏదేదో మాట్లాడారు. మాకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. దళితుల ఓట్ల తోనే మేము గెలిచాం .ఎవరు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ కు మేము వ్యతిరేకం అన్నట్టు గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారి మాట్లాడారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.  

రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే
మా సహచర మహిళా ఎమ్మెల్యేలు సబితా , సునీత లను సీఎం రేవంత్ కావాలనే టార్గెట్ చేశారని కోవా లక్ష్మీ తెలిపారు. సీతక్క కు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పినట్టే ఎమ్మెల్యేలు సబిత ,సునీత లకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితే బాగుండేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే సీఎం రేవంత్ కు చిన్న చూపు అని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఘనత తనదే అన్నట్టుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రయత్నించారు. అసెంబ్లీ లో తీర్మానం చేయడం తో పాటు పాటు పలు మార్లు ఢిల్లీ లో ప్రధాని ని కలిశారని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తెలిపారు. ఓ వైపు ఇందిర సోనియా పేర్లు చెబుతూ రేవంత్ మరొ వైపు మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు. సీఎం హోదా కు దగ్గట్టు రేవంత్ వ్యవహరించడం లేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే రేవంత్ కు ఎందుకు భయం ? అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తిట్టడం తప్ప సీఎం రేవంత్ కు వేరే పని లేదని కోవా లక్ష్మీ మండిపడ్డారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Delhi Crime: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
Embed widget