అన్వేషించండి

TRS Vs BRS : కేసీఆర్ నిర్మించిన పునాదులపైనే కవిత పార్టీ - టీఆర్ఎస్ పేరుతోనే ఫస్ట్ సక్సెస్ - చాలా పెద్ద ప్లానే !

Kavitha Party TRS: టీఆర్ఎస్ పేరుతో పార్టీ ప్రకటించిన కవిత నిర్ణయం వెనుక లోతైన ప్లాన్ ఉంది. తెలంగాణకు ప్రత్యేకమైన పార్టీ లేదని. అది తన పార్టీనే అని కవిత ప్రజల వద్దకు వెళ్తున్నారు.

Telangana Rastra Sena: టీఆర్ఎస్ పేరుతో పార్టీని ప్రారంభించిన  కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంలో ఒక సాహసోపేతమైన మలుపు తీసుకున్నారు. కేవలం ఒక కొత్త పార్టీని స్థాపించడమే కాకుండా, తన తండ్రి కేసీఆర్ నిర్మించిన రాజకీయ పునాదుల పైనే ఎదిగేలా ఆమె రెడీ చేసుకున్న రూట్ మ్యాప్  తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులు తీసుకు రానుంది. 

బీఆర్ఎస్ కోల్పోయిన తెలంగాణ ఆత్మను సొంతం చేసుకున్న టీఆర్ఎస్

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన ఉందని కేటీఆర్ చెప్పారు. దీనికి కారణం ప్రజలు బీఆర్ఎస్‌ పేరు మార్పుతో అనుబంధం కోల్పోయినట్లుగా ఫీలవుతున్నారని కూడా చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఇంతలోనే  కవిత  పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన  గా ప్రకటించారు. దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సమాజంలో  టీఆర్ఎస్ అనే బ్రాండ్ పట్ల ఉన్న సెంటిమెంట్ అనాథగా మారిందని ఆమె గుర్తించారు. ఇప్పుడు  సేన  పేరుతో ఆ పాత  బ్రాండ్‌ను  తిరిగి సొంతం చేసుకోవడం ద్వారా, తెలంగాణ అస్తిత్వానికి అసలైన వారసురాలిని తానే అని ప్రజలకు సంకేతం ఇచ్చారు. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు నా పార్టీయే  అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన ప్రసంగం, ఉద్యమకారులను తనవైపు తిప్పుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.

 రాజకీయ వారసత్వం నుండి విముక్తి

తన ప్రసంగంలో కవిత ఎక్కడా తండ్రి పట్ల మమకారం చూపలేదు.  కేసీఆర్ ఒకప్పుడు ఉద్యమ వీరుడని, కానీ ఇప్పుడు ఆయన కేవలం ఒక  మరమనిషి గా మారిపోయారని వ్యాఖ్యానించడం ద్వారా ఆమె తన రాజకీయ దారిని స్పష్టం చేసుకున్నారు. కుటుంబ సభ్యురాలిగా గత పదేళ్ల పాలనలోని వైఫల్యాలకు క్షమాపణలు కోరడం ద్వారా, ఆమె ప్రజల ముందు ఒక  క్లీన్ ఇమేజ్  తో రావాలని ఆశిస్తున్నారు. తండ్రి నీడ నుండి బయటకు వచ్చి, సొంతంగా ఎదిగే క్రమంలో ఆమె సెంటిమెంట్లను పక్కన పెట్టేసి అత్యంత వాస్తవిక రాజకీయాలను ఎంచుకున్నారు.

 అసంతృప్తితో ఉన్న బీబఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షించే ప్లాన్

సామాజిక రథ చక్రం విరిగి ముక్కలైంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ హయాంలో అణచివేతకు గురైన వర్గాలను ఉద్దేశించినవే. రైతులకు సంకెళ్లు, దళితులకు దెబ్బలు, ఫోన్ ట్యాపింగ్‌తో నిఘా నీడన బతుకులు.. ఇవేవీ మనం కోరుకున్న తెలంగాణ కాదని ఆమె కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, దానికి ప్రత్యామ్నాయంగా తాను ఒక  ప్రజాస్వామ్యయుత  వేదికను అందిస్తున్నానని ఆమె కన్విన్సింగ్ గా చెప్పుకోగలిగారు. పార్టీలో తనను పక్కన పెట్టి, అవినీతి పరులైన  పందికొక్కుల్ని కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నారని కవిత చేసిన ఆరోపణ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ప్రతిబింబిస్తోంది. పార్టీని దోచుకునే వారికి ప్రాధాన్యత పెరిగిందని, నిబద్ధత గల వారికి స్థానం లేదని ఆమె మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తన పార్టీ వైపు ఆకర్షించేందుకు ఆమె గట్టి పునాది వేశారు. తన టీఆర్ఎస్ లో పారదర్శకత ఉంటుందని, అవినీతికి తావుండదని ఆమె హామీ ఇచ్చారు.

 అమ్మతనంతో కొత్త అధ్యాయం 

చివరగా, తాను ఒక  అమ్మగా  ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పడం ద్వారా ఆమె ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచుకున్నారు. బీఆర్ఎస్ ఒక కార్పొరేట్ సంస్థలా మారిందని, తన తెలంగాణ రాష్ట్ర సేన మాత్రం ఒక కుటుంబంలా ఉంటుందని ఆమె నమ్మించగలిగారు.  రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా తన అడుగులు వేస్తున్నారు. తెలంగాణ గడ్డపై ఇప్పుడు అసలైన టీఆర్ఎస్  పోరు మొదలైందని ఆమె చాటిచెప్పారు. కవిత రాజకీయంతో బీఆర్ఎస్ పార్టీకి చిక్కులు తప్పకపోవచ్చనిరాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Krishna Water Issue: కొలిక్కిరాని కృష్ణా జలాల పంచాయితీ.. వాడీవేడిగా వాదనలు.. నెలాఖరున మరోసారి భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంచాయితీ.. వాడీవేడిగా వాదనలు.. నెలాఖరున మరోసారి భేటీ!

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget