(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay : 14న కరీంనగర్‌కు అసోం సీఎం - బండి సంజయ్‌తో కలిసి హిందూ ఏక్తాయాత్ర !
14వ తేదీన అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కరీంనగర్ రానున్నారు. బండి సంజయ్ నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్రలో పాల్గొననున్నారు.
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో మరోసారి హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 14న కరీంనగర్ లో నిర్వహించే "హిందూ ఏక్తా యాత్ర"కు ముఖ్య అతిధిగా అసోమ్ CM హిమంత బిశ్వ శర్మ హాజరు కానున్నరాు. హిమంత తోపాటు "హిందూ ఏక్తా యాత్ర"కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కూడా హాజరు కానున్నారు. లక్ష మందితో "హిందూ ఏక్తా యాత్ర" నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. *"హిందూ ఏక్తా యాత్ర" ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుతామని *హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
గత ఏడాది ఏక్తా యాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు
బండి సంజయ్ కరీంనగర్‌లో ప్రతీ ఏడాది హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తూ ఉంటారు. ప్రతీ ఏడాది ఓ ముఖ్య అతిధిని ఆహ్వానిస్తారు. గత ఏడాది నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. మసీదులను తవ్వుదామని అసదుద్దీన్ ఓవైసీకి చాలెంజ్ చేశారు. తెలంగాణకు పట్టిన శని పీడను వదిలించి రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని… మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని ప్రకటించారు. అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామన్నారు. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతామని ఉద్ఘాటించారు. ఢిల్లీకి రాజైనా ఎప్పటికీ నేను కరీంనగర్ బిడ్డనేనని… జిల్లా ప్రజలకు ఏ ఆపదొచ్చినా పెద్ద కొడుకుగా ఉంటూ ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. కొనఊపిరి ఉన్నంత వరకు తెలంగాణలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
ప్రతీ సారి భారీగా హాజరయ్యే కరీంనగర్ ప్రజలు
కరీంనగర్ లో బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించే హిందూ ఏక్తా యాత్రకు వేలాది మంది ప్రజలు తరలివస్తూంటారు. కరీంనగర్ హిందు సమాజం నన్ను ఎంపీగా గెలిపించిందని.. తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని కాపాడాలంటూ నన్ను రాష్ట్రానికి పంపింది కరీంనగర్ ప్రజలేనని బండి సంజయ్ చెబుతూంటారు. .తెలంగాణ గడ్డను కాషాయ మయం చేస్తున్నా.తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేసి రాష్ట్రాన్ని పవిత్రం చేసే బాధ్యతను తీసుకున్నా… తప్పకుండా రామరాజ్యం రావాల్సిందేనని చెబుతూంటారు. కరీంనగర్ నడిబొడ్డున ఈద్గా పోవాలన్నా… వేములవాడలో దర్గా పోవాలంటే రామరాజ్యం రావాల్సిందేనని బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు.
రామరాజ్యాన్ని స్థాపిస్తామన్న బండి సంజయ్
కరీంనగర్‌లో జరిగిన ఏక్తా యాత్రలో బండి సంజయ్ రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని పాతరేస్తామని. రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామని చెబుతూ ఉంటారు. కరీంనగర్ జిల్లా ప్రజల చలువతోనే రాష్ట్రంలో నాకు పేరొస్తుంది. రాబోయే రోజుల్లో వచ్చే ఫలితాలన్నీ మీ చలువే.. ఢిల్లీకి రాజైనా కరీంనగర్ కు నేను బిడ్డనే. కరీంనగర్ జిల్లా ప్రజలకు పెద్ద కొడుకుగా ఉంటా.. ఏ హిందువుకు కష్టమొచ్చినా హనుమంతుడి భక్తుడిగా ఛత్రపతి శివాజీ వారసుడిగా ఆదుకుంటా… నా చివరి రక్తపు బొట్టును సైతం ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇస్తున్నారు. గత ఏడాదిలాగే ఈ సారి కూడా భారీగా యాత్ర నిర్వహించాలనే లక్ష్యంతో బండి సంజయ్ ఉన్నారు.