Breaking News Live Updates: సీట్ కింద గంజాయి.. సీక్రెట్ గా రవాణా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 25న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన, అనంతరం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పార్టీ రాజకీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయి అంశాలపై కొన్ని తీర్మానాలు చేస్తారు. వీటిని ఏడుగురు వేర్వేరు నేతలు ప్రతిపాదిస్తారు. అనంతరం వాటిపై చర్చించి, ఆమోదించుకుంటారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమై 20 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీ మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. నేడు ప్లీనరీ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. 2018 తర్వాత మూడేళ్లకు ఇది జరుగుతోంది. టీఆర్ఎస్ 13 ఏళ్లపాటు ఉద్యమం నడిపి, ఏడేళ్ల క్రితమే అధికారంలోకి వచ్చింది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. దీని కోసం బస్తీ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్లీనరీకి ప్రజాప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల ప్రతినిధులనూ ఆహ్వానించారు.
Also Read : టీఆర్ఎస్ @ 20 ...చింతమడక నుంచి ప్రజల మనసుల్లోకి కేసీఆర్ !
ఆహ్వానితులు వీరే..
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్‌పర్సన్లతో పాటు మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు అందరినీ ఆహ్వానించారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఆరున్నర వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళలు గులాబీ రంగు వస్త్రాలు ధరించి రావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. సభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
Also Read : బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రం.. కేసీఆర్, కవిత ఫోటోలు కూడా.. మీరూ చూడండి
హరీశ్ రావు దూరం
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలంతా ఇప్పుడు ప్లీనరీ మూడ్‌లో ఉన్నారు. కానీ ఈ ప్లీనరీకి హరీష్ రావుకు ఆహ్వానం లేదు. ఆయన ఒక్కరికి మాత్రమే కాదు హుజురాబాద్ ఎన్నికల పనులు చూసుకుంటున్న ఎవరికీ ఆహ్వానం లేదు. అందరూ ఎన్నికల పనుల్లోనే బిజీగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్‌తో పాటు హుజూరాబాద్‌లో ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్న వారెవరూ కూడా నియోజకవర్గంలో నుంచి కదలవద్దని చెప్పినట్లుాగ తెలుస్తోంది. అక్కడ మకాం వేసిన టీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుండి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారినికే పరిమితం కానున్నారు.
Also Read: బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
సీట్ కింద గంజాయి.. సీక్రెట్ గా రవాణా
తూర్పుగోదావరి జిల్లా చింతూరులో గంజాయి పట్టుబడింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహన సీట్ లో అమర్చిన గంజాయి రవాణా చేస్తున్నారు. గంజాయి రవాణాకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి గంజాయి ముఠాలు. ద్విచక్ర వాహనం సీట్ లో అమర్చిన 34 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హుజూరాబాద్ లో తొలిసారిగా 72 గంటల నిబంధన
హుజూరాబాద్ ఉపఎన్నికలో 72 గంటల నిబంధనను ఎలక్షన్ కమీషన్ తొలసారిగా అమలుచేస్తుంది. ఈ ఎన్నికల్లో స్థానికేతరులైన నాయకులూ, కార్యకర్తలు 72 గంటల ముందే హుజూరాబాద్ ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. స్థానికేతర నేతలకు ఈ నిబంధనపై అంతగా అవగాహన లేకపోవడంతో అయోమయంలో ఉన్నారు. ఎన్నికకు ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందు, డబ్బు పంపిణీ అడ్డుకోడానికి తీసుకొనే చర్యల్లో భాగంగానే ఈ నూతన విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది.
ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ.. 7 తీర్మానాలకు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ వేడుకలు(ప్లీనరీ) ముగిసింది. హైదరాబాద్ హెటెక్స్ లో జరిగిన ఈ సమావేశంలో ఏడు తీర్మానాలు ఆమోదం తెలిపారు. సుమారు ఎనిమిది గంటల పాటు ప్లీనరీ జరిగింది. కేసీఆర్ ను టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కేసీఆర్ రానప్పుడు ఈ పథకాలు ఎక్కడివి.. చెంప పగిలేలా బదులివ్వండి.. మంత్రి జగదీష్ రెడ్డి
గుడారాలు, గుడిసెలు కింద సభ నుండి హైటెక్స్ లో ఘనంగా జరుపుకునే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించే స్థాయికి నల్గొండ ఎదిగింది. పథకాలకు సీఎం కేసీఆర్ ఇంట్లో డబ్బు పెడుతున్నాడా అంటే.. చెంప పగిలేలా సమాధానం చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ రానప్పుడు ఈ పథకాలు ఎక్కడివి.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఇలాంటి పథకాలు పెట్టలేకపోయారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
చిత్తూరు బాలుడి హత్య కేసులో సంచలనం... బాలుడిపై లైంగిక దాడి
చిత్తూరు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడిని బొప్పాయి తోటలోకి ఎత్తుకెళ్లి మరో మైనర్ లైంగిక దాడిచేసినట్లు పోలీసులు విచారణ తెలిసింది. నిందితుడు హోమోసెక్సువల్ అని పోలీసులు భావిస్తున్నారు. బయటపెడతాడనే భయంతోనే బాలుడ్ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.